రష్మిక శుభారంభం | Rashmika entered the quarter finals in doubles | Sakshi
Sakshi News home page

రష్మిక శుభారంభం

Sep 21 2023 1:11 AM | Updated on Sep 21 2023 1:11 AM

Rashmika entered the quarter finals in doubles - Sakshi

అంతర్జాతీయ మహిళల టెన్నిస్‌ (ఐటీఎఫ్‌) టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేసింది. సింగిల్స్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరిన ఆమె, డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. పెర్త్‌లో జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రష్మిక 6–3, 6–3తో జెస్సీ కులే (ఆస్ట్రేలియా)పై గెలిచింది. డబుల్స్‌ తొలి రౌండ్‌లో రష్మిక (భారత్‌)–మోనిక్‌ బ్యారీ (న్యూజిలాండ్‌) ద్వయం 6–4, 7–6 (7/5)తో ఎలీనా మిసిచ్‌ (ఆ్రస్టేలియా)–మిచికా ఒజెకి (జపాన్‌) జంటను ఓడించింది.

Advertisement
 
Advertisement
Advertisement