టీమిండియా బ్యాటింగ్‌.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం | Rain Stops Play India Vs New Zeland 2nd ODI Match | Sakshi
Sakshi News home page

IND Vs NZ 2nd ODI: టీమిండియా బ్యాటింగ్‌.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం

Nov 27 2022 7:48 AM | Updated on Nov 27 2022 7:51 AM

Rain Stops Play India Vs New Zeland 2nd ODI Match - Sakshi

న్యూజిలాండ్‌, టీమిండియా సిరీస్‌ను వరుణుడు విడవడం లేదు. టి20 సిరీస్‌లో ఎలాగైతే అడ్డుపడ్డాడో.. ఇప్పుడు వన్డే సిరీస్‌కు అదే పరిస్థితి కలిగిస్తున్నాడు. ఆదివారం టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య ప్రారంభమైన రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

టీమిండియా 4.5 ఓవర్లలో 22 పరుగులు వద్ద ఉన్నప్పుడు వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. శిఖర్‌ ధావన్‌ 2, శుబ్‌మన్‌ గిల్‌ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక తొలి వన్డేలో పరాజయం పొందిన టీమిండియా సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం తప్పనిసరి. మరి వర్షం తెరిపినిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement