శ్రీలంక, వెస్టిండీస్‌ రెండో వన్డే వర్షార్పణం | Rain in Kingston washes out second ODI between West Indies and Sri Lanka | Sakshi
Sakshi News home page

SL vs WI: శ్రీలంక, వెస్టిండీస్‌ రెండో వన్డే వర్షార్పణం

Jun 8 2026 9:54 AM | Updated on Jun 8 2026 10:37 AM

Rain in Kingston washes out second ODI between West Indies and Sri Lanka

శ్రీలంక, వెస్టిండీస్‌ మధ్య ఆదివారం జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణం అయింది. భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 41 పరుగులు తేడాతో విజయం సాధించింది.

దీంతో ప్రస్తుతం లంక జట్టు సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టన్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం లంక జట్టుకు అదే తొలి విజయం. అలాగే కరీబియన్‌ దీవుల్లో శ్రీలంక జట్టుకు 13 ఏళ్ల తర్వాత ఇదే తొలి వన్డే గెలుపు. 

ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య వెస్టిండీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం అవుతుందనుకుంటే... భారీ వర్షం కారణంగా అది సాధ్యపడలేదు. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇక్కడే చివరిదైన మూడో వన్డే జరగనుంది. ఆ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.
చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. క‌ట్ చేస్తే! కేవ‌లం 10 బంతుల్లోనే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement