
పనాజీ (గోవా): టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ప్రైమ్ వాలీబాల్ లీగ్ (PVL)లో వ్యాపార భాగస్వామిగా అడుగు పెట్టాడు. ఈ టోర్నీలోని జట్టు అయిన గోవా గార్డియన్స్‌కు అతడు సహ యజమానిగా వ్యవహరిస్తాడు. హైదరాబాద్‌లో అక్టోబర్ 2 నుంచి 26 వరకు పీవీఎల్ జరుగుతుంది. వాలీ బాల్ లీగ్‌లో ఈ సీజన్‌తోనే గోవా జట్టు తొలిసారి అడుగు పెడుతోంది. రాజు చేకూరి ఈ టీమ్‌కు యజమానిగా ఉన్నాడు.
కీలక మలుపు
ఇప్పుడు రాహుల్ కొత్తగా టీమ్‌తో జత కట్టాడు. ‘భారత క్రీడల్లో ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఒక కీలక మలుపు. ప్రేక్షకులకు మరింత చేరువ అవుతూ ఈ ఆట స్థాయిని పెంచేందుకు ఇది ఉపకరిస్తుంది. చిన్నప్పటినుంచి వాలీబాల్‌ను ఎంతో ఇష్టంగా చూసేవాడిని. ఇప్పుడు అదే క్రీడకు సంబంధించిన లీగ్‌లో నేనూ భాగం కావడం సంతోషంగా ఉంది’ అని రాహుల్ వ్యాఖ్యానించాడు.
ఇదీ చదవండి: డికాక్ రిటైర్మెంట్ వెనక్కి...
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్ తిరిగి వన్డేలు ఆడేందుకు ‘సై’ అంటున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు గతంలో ఇచ్చిన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో పాకిస్తాన్‌లో పర్యటించే దక్షిణాఫ్రికా జట్టుకు అతన్ని ఎంపికచేశారు.
ఈ ఎడంచేతి ఓపెనింగ్ బ్యాటర్ 2023లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం రిటైర్ అయ్యాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ వరకు పొట్టి ఫార్మాట్‌లో ఆడినప్పటికీ తర్వాత మాజీ కోచ్ రాబ్ వాల్టర్ తమ దీర్ఘకాలిక జట్టు సన్నద్ధత–లక్ష్యాల్లో భాగంగా డికాక్‌కు టీ20ల్లో అవకాశమివ్వలేదు.
కానీ ఇప్పుడు నమీబియాతో జరిగే ఏకైక టి20 మ్యాచ్ కోసం ప్రకటించిన దక్షిణాఫ్రికా జట్టులో డికాక్‌కు చోటు దక్కింది. ఈ మేరకు ప్రస్తుత సఫారీ కోచ్ షుక్రి కాన్‌రడ్ మాట్లాడుతూ డికాక్ మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు తిరిగిరావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది జట్టుకు బలాన్నిస్తుందని అన్నారు.
అయితే సఫారీ జట్టుకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ‘గద’ను అందించిన కెపె్టన్ తెంబా బవుమా గాయంతో పాక్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. వచ్చే నెలలో లాహోర్, రావల్పిండి వేదికలపై రెండు టెస్టుల సిరీస్ జరుగుతుంది.