రెండో గేమ్‌లో కార్ల్‌సన్‌తో గట్టి పోరాటమే చేయాలి: ప్రజ్ఞానంద | Praggnanandhaa and Carlsen's first game of chess finals ends in draw - Sakshi
Sakshi News home page

రెండో గేమ్‌లో కార్ల్‌సన్‌తో గట్టి పోరాటమే చేయాలి: ప్రజ్ఞానంద

Aug 23 2023 2:51 AM | Updated on Aug 23 2023 1:03 PM

Pragnananda and Carlsons first game draw - Sakshi

బకూ (అజర్‌బైజాన్‌): ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగం టైటిల్‌ కోసం భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద, వరల్డ్‌ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) మధ్య జరిగిన తొలి గేమ్‌ ‘డ్రా’గా ముగిసింది. తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ గేమ్‌లో తెల్ల పావులతో ఆడాడు. 35 ఎత్తుల తర్వాత ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు సమ్మతించారు.

‘తొలి గేమ్‌లో నేను ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. రెండో గేమ్‌లో కార్ల్‌సన్‌తో గట్టి పోరాటమే చేయాల్సి ఉంటుంది. అతడిని నిలువరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. వీరిద్దరి మధ్య నేడు రెండో గేమ్‌ జరుగుతుంది. ఈ గేమ్‌లో కార్ల్‌సన్‌ తెల్ల పావులతో ఆడతాడు. ఈ గేమ్‌లో గెలిచిన ప్లేయర్‌కు ప్రపంచకప్‌ టైటిల్‌ లభిస్తుంది. ఒకవేళ రెండో గేమ్‌ కూడా ‘డ్రా’ అయితే గురువారం టైబ్రేక్‌ గేమ్‌ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement