RCB Vs PBKS: సింగ్ ఈజ్ కింగ్‌.. సూప‌ర్ హెలికాప్టర్ షాట్! వీడియో వైర‌ల్‌ | IPL 2024 RCB Vs PBKS: Prabhsimran Singh Hits Helicopter Shot For A 90-Metre Six Vs Cameron Green, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs PBKS: సింగ్ ఈజ్ కింగ్‌.. సూప‌ర్ హెలికాప్టర్ షాట్! వీడియో వైర‌ల్‌

Mar 25 2024 9:23 PM | Updated on Mar 26 2024 12:49 PM

Prabhsimran Singh Hits Helicopter Shot For A 90-Metre Six - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2024లో పంజాబ్ కింగ్స్ యువ ఆట‌గాడు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మ‌రోసారి త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో అక‌ట్టుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ప్ర‌భు సిమ్రాన్ కాసేపు త‌న బ్యాటింగ్‌తో అల‌రించాడు. కేవ‌లం 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 25 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో ప్ర‌భు సిమ్రాన్ హెలికాప్టర్ షాట్‌తో మెరిశాడు. 

పంజాబ్ ఇన్నింగ్స్ 7వ ఓవ‌ర్ వేసిన కామెరాన్ గ్రీన్ నాలుగో బంతిని మిడిల్ స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేశాడు. ఈ క్ర‌మంలో కాస్త ఆఫ్ సైడ్ జ‌రిగి హెలికాప్టర్ షాట్ ఆడాడు. అత‌డి  బ్యాట్ స్పిడ్ దాటికి బంతి స్టాండ్స్‌లో ప‌డింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇది చూసిన నెటిజ‌న్లు ధోనిలా ఆడాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో శిఖ‌ర్ ధావ‌న్‌(45) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. జితేష్ శ‌ర్మ‌(27), శ‌శాంక్ సింగ్‌(21) ప‌రుగుల‌తో రాణించారు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో మాక్స్‌వెల్‌, సిరాజ్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జోష‌ఫ్‌, ద‌యాల్ త‌లా వికెట్ సాధించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement