సెయింజ్‌కు ‘పోల్‌’  | Pole position to Carlos Sainz | Sakshi
Sakshi News home page

సెయింజ్‌కు ‘పోల్‌’ 

Sep 17 2023 1:42 AM | Updated on Sep 17 2023 1:42 AM

Pole position to Carlos Sainz - Sakshi

సింగపూర్‌: ఫార్ములావన్‌లో ఈ సీజన్‌లో తొలిసారి రెడ్‌బుల్‌ డ్రైవర్లు వెర్‌స్టాపెన్, సెర్జియో పెరెజ్‌ నిరాశపరిచారు. శనివారం జరిగిన సింగపూర్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో వెర్‌స్టాపెన్‌ 11వ స్థానంలో, పెరెజ్‌ 13వ స్థానంలో నిలిచారు. నేడు జరిగే ప్రధాన రేసును వెర్‌స్టాపెన్‌ 11వ స్థానం నుంచి, పెరెజ్‌ 13వ స్థానం నుంచి ప్రారంభిస్తారు.

మరోవైపు ఫెరారీ డ్రైవర్‌ కార్లోస్‌ సెయింజ్‌ అందరికంటే వేగంగా ల్యాప్‌ను 1 నిమిషం 30.984 సెకన్లలో ముగించి ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును సెయింజ్‌ తొలి స్థానం నుంచి మొదలు పెడతాడు. ఈ సీజన్‌లో 14 రేసులు జరగ్గా... 14 రేసుల్లోనూ రెడ్‌బుల్‌ డ్రైవర్లు వెర్‌స్టాపెన్‌ (12 రేసుల్లో), పెరెజ్‌ (2 రేసుల్లో) విజేతలుగా నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement