వన్డేల్లో నెం1 జట్టుగా పాకిస్తాన్‌.. మరి టీమిండియా? | Pakistan Whitewash Afghanistan 3-0 to Top ODI Rankings - Sakshi
Sakshi News home page

ICC ODI rankings: వన్డేల్లో నెం1 జట్టుగా పాకిస్తాన్‌.. మరి టీమిండియా?

Aug 27 2023 9:05 AM | Updated on Aug 27 2023 11:23 AM

Pakistan Whitewash Afghanistan 3-0 To Top ODI rankings - Sakshi

అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ అగ్రస్ధానానికి చేరుకుంది. శ్రీలంక వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన పాకిస్తాన్‌.. మళ్లీ నెం1 వన్డే జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి బాబర్‌ సేన టాప్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. కాగా  118 రేటింగ్‌తో పాక్‌ -ఆస్ట్రేలియా జట్లు సమం ఉన్నాయి. అయితే పాయిట్లు పరంగా ఆస్ట్రేలియా(2714) కంటే పాకిస్తాన్‌(2725) ముందంజలో ఉండడంతో అగ్రపీఠాన్ని సొంతం చేసుకుంది.

ఇక భారత జట్టు విషయానికి వస్తే.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్ధానంలో కొనసాగుతుంది. రేటింగ్స్ పరంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా కంటే ఐదు పాయింట్లు వెనుకబడి ఉంది. ఇక న్యూజిలాండ్ 104 రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. అదే విధంగా ప్రస్తుత వరల్డ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌  ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్ధానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌,శ్రీలంక, ఆఫ్గానిస్తాన్‌, వెస్టిండీస్‌ నిలిచాయి.

సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌..
ఇక  కొలాంబో వేదికగా జరిగిన మూడో వన్డే విషయానికి వస్తే.. 59 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌ను ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను  3–0తో పాకిస్తాన్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (67), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (60) అర్ధ సెంచరీలు సాధించగా, ఆగా సల్మాన్‌ (38 నాటౌట్‌), నవాజ్‌ (30) రాణించారు.

నైబ్, ఫరీద్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గన్‌ జట్టు 48.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్గాన్‌ స్పిన్నర్‌ ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ (37 బంతుల్లో 64) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. పాక్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. నవాజ్‌, అఫ్రిది,అష్రాప్‌ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండిWorld Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. స్టార్‌ ఆటగాళ్లకు నో ఛాన్స్‌! సంజూకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement