Devon Conway: కాన్వే అరుదైన రికార్డు! తొలి కివీస్‌ బ్యాటర్‌గా.. కానీ అదొక్కటే మిస్‌!

Pak Vs NZ: Conway Becomes Fastest NZ Batter To Achieve This But - Sakshi

Pakistan vs New Zealand, 1st Test: న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో కివీస్‌ తరఫున అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన కాన్వే ఈ ఘనత సాధించాడు.

కాగా రెండో రోజు ఆటలో భాగంగా ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే 12 ఫోర్ల సాయంతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్న అతడు.. కివీస్‌ ప్లేయర్‌ జాన్‌ రీడ్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.

అదొక్కటే లోటు
రీడ్‌ 20 ఇన్నింగ్స్‌లో ఈ మార్కు అందుకోగా.. కాన్వే 19 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ సాధించాడు. కాగా టెస్టుల్లో కాన్వే అత్యుత్తమ స్కోరు 200. ఇక ఇప్పటి వరకు కాన్వే ఖాతాలో మూడు శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి.

అయితే పాక్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసే అవకాశం చేజారింది. మూడో రోజు ఆటలో నౌమన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించిన కాన్వే సెంచరీని మిస్‌ చేసుకున్నాడు. ఇక టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మార్కు అందుకున్న రికార్డు హర్బర్ట్‌ సట్‌క్లిఫ్‌(12 ఇన్నింగ్స్‌లో 1925లో ఆస్ట్రేలియాపై) పేరిట ఉంది.

చదవండి: WC 2023: వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా ఓపెనర్‌ అతడే! గర్వం తలకెక్కితే మాత్రం.. 
Rishabh Pant: ఇదే కదా జరగాల్సింది! ఇకపై పంత్‌ కంటే ముందు వరుసలో వాళ్లిద్దరు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top