Pak Vs NZ 1st Test: పాక్‌ 438 ఆలౌట్‌.. చెలరేగిన కివీస్‌ ఓపెనర్లు.. దీటైన జవాబు

Pak Vs NZ 1st Test: Pak All 438 Out Latham Conway Lead Strong Reply - Sakshi

Pakistan vs New Zealand, 1st Test Day 2 Highlights- కరాచీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ దీటైన జవాబిచ్చింది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (82 బ్యాటింగ్‌; 12 ఫోర్లు), టామ్‌ లాథమ్‌ (78 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో రెండో రోజు ఆట నిలిచే సమ యానికి కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 165 పరుగులు చేసింది.

దాదాపు రెండు సెషన్ల పాటు క్రీజు వీడకుండా న్యూజిలాండ్‌ ఓపెనర్లు పాకిస్తాన్‌ బౌలర్లను ఎదుర్కొన్నారు. అంతకుముందు ఉదయం 317/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ 438 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్స్‌లో కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (161) అదే స్కోరుపై అవుటవగా, ఆగా సల్మాన్‌ (103; 17 ఫోర్లు) సెంచరీ సాధించాడు.

ఇక న్యూజిలాండ్‌ బౌలర్లలో సౌతీ 3 వికెట్లు పడగొట్టగా, ఎజాజ్, బ్రేస్‌వెల్, ఇష్‌ సోధి తలా 2 వికెట్లు తీశారు. రెండు రోజు ఆట ముగిసే సరికి కివీస్‌ 273 పరుగులు వెనుకబడి ఉన్నప్పటికీ చేతిలో పది వికెట్లున్నాయి. 

చదవండి: Shikhar Dhawan: ధావన్‌పై వేటు.. వాళ్ల నుంచి తీవ్రమైన పోటీ! వరల్డ్‌కప్‌ ఆశలు ఆవిరి! మిస్‌ యూ గబ్బర్‌ అంటూ..
David Warner: 11 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల అనుభవంతో అరంగేట్రం.. అత్యుత్తమ ప్రదర్శనలు ఇవే
Ind_W Vs SA_W: అదరగొట్టిన షబ్నమ్‌.. దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం
Babar Azam: పాంటింగ్‌ రికార్డు బద్దలు కొట్టిన బాబర్‌ ఆజం! సెహ్వాగ్‌లా అలా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top