ఒడిశా గెలిచిందోచ్‌... | Odisha FC Thrash Kerala Blasters 4-2 For First Win Of The Season | Sakshi
Sakshi News home page

ఒడిశా గెలిచిందోచ్‌...

Jan 8 2021 6:20 AM | Updated on Jan 8 2021 6:20 AM

Odisha FC Thrash Kerala Blasters 4-2 For First Win Of The Season - Sakshi

పనాజీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో ఇప్పటిదాకా బోణీ చేయని ఏకైక జట్టుగా ఉన్న ఒడిశా ఎఫ్‌సీ ఆ ముద్రను తాజా విజయంతో తొలగించుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఒడిశా జట్టు 4–2తో కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీపై విజయం సాధించింది. ఒడిశా స్ట్రయికర్‌ డీగో మౌరిసియో చెలరేగాడు. పది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఒడిశా జట్టులో స్టీవెన్‌ టేలర్‌ (42వ ని.) మౌరిసియో (50వ, 60వ ని.) గోల్స్‌ సాధించారు. కాగా అంతకుముందే ప్రత్యర్థి ఆటగాడు జీక్సన్‌ సింగ్‌ (22వ ని.) సెల్ఫ్‌గోల్‌ చేయడంతో ఒడిశా స్కోరు 4కు చేరింది. కేరళ జట్టులో జోర్డాన్‌ ముర్రే (7వ ని.), గ్యారీ హూపర్‌ (79వ ని.) చెరో గోల్‌ చేశారు. 9 మ్యాచ్‌లాడిన ఒడిశా ఆరు పోటీల్లో ఓడిపోగా రెండు మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. శుక్రవారం జరిగే పోరులో హైదరాబాద్‌ ఎఫ్‌సీతో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ తలపడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement