కివీస్‌ ఇక బిజీ బిజీ

New Zealand Cricket Board Released List Of Series In New Zealand - Sakshi

సొంతగడ్డపై వరుసగా సిరీస్‌లు 

ఆక్లాండ్‌: ఇన్నాళ్లూ కరోనా వల్ల సొంతగడ్డపై క్రికెట్‌ టోర్నీలకు దూరమైన న్యూజిలాండ్‌లో త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌ పునఃప్రారంభం కానుంది. నవంబర్‌లో వెస్టిండీస్‌ సిరీస్‌ మొదలు... వరుసగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో బిజీ బిజీగా క్రికెట్‌ ఆడనుంది. మంగళవారం దీనికి సంబంధించిన షెడ్యూలును న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ముందుగా కరీబియన్, పాకిస్తాన్‌లు పర్యటించేందుకు ప్రభుత్వ ఆమోదం లభించిందని, ఆ తర్వాత ఆసీస్, బంగ్లా సిరీస్‌లకు లభిస్తుందని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ వైట్‌ వెల్లడించారు. తొలుత విండీస్‌తో నవంబర్‌ 27, 29, 30 తేదీల్లో మూడు టి20 మ్యాచ్‌ లు ఆడుతుంది. తర్వాత డిసెంబర్‌ 3–7, 11–15 వరకు రెండు టెస్టు మ్యాచ్‌ల్లో తలపడుతుంది. ఇది ముగిసిన వెంటనే పాక్‌తో 18 నుంచి మొదలయ్యే మూడు టి20ల సిరీస్‌లో పాల్గొంటుంది. అనం తరం రెండు టెస్టుల సిరీస్‌ డిసెంబర్‌ 26 నుంచి జరుగుతుంది. ఫిబ్రవరిలో ఆసీస్‌తో, మార్చిలో బంగ్లాదేశ్‌లో ముఖాముఖి సిరీస్‌లు ఉంటాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top