బంగ్లాదేశ్ జట్టులో మిస్టరీ స్పిన్నర్‌ | Mystery spinner Aliss included in Bangladesh squad for ODI tri series | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ జట్టులో మిస్టరీ స్పిన్నర్‌

Oct 10 2026 5:23 PM | Updated on Oct 10 2026 5:29 PM

Mystery spinner Aliss included in Bangladesh squad for ODI tri series

source: X

యూఏఈ వేదికగా జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో అంతర్జాతీయ వన్డేల్లో ఇంకా అరంగేట్రం చేయని మిస్టరీ స్పిన్నర్ అలిస్ అల్ ఇస్లామ్‌కు చోటు దక్కింది.

అలిస్ అల్ ఇస్లామ్ ఇప్పటివరకు 19 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 35 వికెట్లు పడగొట్టాడు. 17.05 సగటున 4.05 ఎకానమీ రేటు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో బంగ్లాదేశ్-ఏ జట్టు తరఫున కూడా మెరుగ్గా రాణించాడు. ఈ ప్రదర్శనల ఆధారంగా అతడికి తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇస్లామ్‌ టీ20 అరంగేట్రం చేశాడు.

సీనియర్ల రీఎంట్రీ
ఈ టోర్నీతో సీనియర్లు లిటన్ దాస్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా లిటన్‌ దాస్‌ వ్యవహరించనుండగా.. వైస్‌ కెప్టెన్‌గా తౌహిద్‌ హృదయ్‌ ఎంపియ్యాడు.

నహీద్‌ రాణా దూరం
గాయం కారణంగా పేసర్ నహీద్ రాణాకు జట్టులో చోటు దక్కలేదు. అతడు ప్రస్తుతం పునరావాస చికిత్స పొందుతున్నాడు. గతంలో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన పర్వేజ్ హొస్సేన్, మహమ్మద్ సైఫుద్దీన్‌లను కూడా ఈసారి ఎంపిక చేయలేదు.

కాగా, అక్టోబర్ 17న ప్రారంభం కానున్న ముక్కోణపు టోర్నీలో బంగ్లాదేశ్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్‌, జింబాబ్వే జట్లు పాల్గొంటున్నాయి. తొలి బంగ్లాదేశ్, జింబాబ్వే అబుదాబిలో తలపడనున్నాయి. అక్టోబర్ 19న ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 21న షార్జాలో ఆఫ్ఘనిస్తాన్‌తో బంగ్లాదేశ్ ఆడుతుంది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 23న షార్జాలో నిర్వహించనున్నారు.

ముక్కోణపు టోర్నీ కోసం బంగ్లాదేశ్ జట్టు: లిటన్ దాస్ (కెప్టెన్), తౌహిద్ హృదయ్ (వైస్ కెప్టెన్), తంజిద్ హసన్, సైఫ్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, ముసద్దెక్ హొస్సేన్ సైకత్, మెహదీ హసన్ మిరాజ్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, రిషాద్ హొస్సేన్, తన్వీర్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, షరీఫుల్ ఇస్లామ్, అలిస్ అల్ ఇస్లామ్

ఇదీ చదవండి: సౌతాఫ్రికాపై వీరోచిత శతకం.. రికార్డుల మోత మోగించిన రెన్షా


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement