సౌతాఫ్రికాపై వీరోచిత శతకం.. రికార్డుల మోత మోగించిన రెన్షా | Matt Renshaw Ends 9 Year Wait, Creates Multiple Records With Hundred In Durban Test | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాపై వీరోచిత శతకం.. రికార్డుల మోత మోగించిన రెన్షా

Oct 10 2026 4:56 PM | Updated on Oct 10 2026 5:12 PM

Matt Renshaw Ends 9 Year Wait, Creates Multiple Records With Hundred In Durban Test

source: X

డర్బన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ మ్యాట్‌ రెన్షా అద్భుత శతకంతో చెలరేగాడు. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, పతనం దిశగా సాగుతున్న తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఓ పక్క సహచరుల వికెట్లు వరుసగా పడుతున్నా, కమిన్స్‌ (43) సాయంతో వీరోచితంగా పోరాడాడు.

ఈ క్రమంలో తొమ్మిదేళ్ల తన సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. 2016 టెస్ట్‌ అరంగేట్రం చేసిన 30 ఏళ్ల రెన్షా.. 2017పై పాకిస్తాన్‌పై తన ఏకైక సెంచరీ చేశాడు. అప్పటి నుంచి జట్టులోకి వస్తూ పోతూ ఉన్న అతడు.. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల విరామం తర్వాత మరో సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో రెన్షా మరిన్ని రికార్డులు కూడా సాధించాడు.

12 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై ఆసీస్ బ్యాటర్‌ సెంచరీ
12 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై టెస్టు శతకం సాధించిన తొలి ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రెన్షా నిలిచాడు. 2014 కేప్‌టౌన్‌ టెస్ట్‌లో డేవిడ్ వార్నర్ సెంచరీ (145)  చేసిన తర్వాత.. రెన్షాదే తొలి శతకం. దీంతో సౌతాఫ్రికా గడ్డ ఆసీస్‌ బ్యాటర్ల సెంచరీ కరువు తీరింది.

నాలుగేళ్ల తర్వాత విదేశీ బ్యాటర్‌ శతకం
2022లో బంగ్లాదేశ్ బ్యాటర్ మహ్మదుల్ హసన్ జాయ్ (137) సెంచరీ చేసిన తర్వాత డర్బన్‌లో సెంచరీ సాధించిన తొలి విదేశీ బ్యాటర్‌గా రెన్షా నిలిచాడు.

17 ఏళ్ల తర్వాత ఆసీస్ ఆటగాడి సెంచరీ
17 ఏళ్ల తర్వాత డర్బన్‌లో టెస్టు శతకం సాధించిన ఆస్ట్రేలియన్‌గా రెన్‌షా నిలిచాడు. 2009లో ఫిలిప్ హ్యూస్ డర్బన్‌లో టెస్ట్‌ సెంచరీ (160) చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా రెండో రోజు రెండో సెషన్‌ సమయానికి 8 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సెంచరీ తర్వాత కూడా రెన్షా (131 నాటౌట్‌) పోరాడుతున్నాడు. అతడికి నాథన్‌ లియోన్‌ (13 నాటౌట్‌) సహకరిస్తున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో ఆసీస్‌ ఓ దశలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. ఈ దశలో రెన్షా.. కమిన్స్‌ సాయంతో ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దాడు.

ఇదీ చదవండి: చాంపియన్స్ అని ఊరికే అనలేదు.. ఇదీ కమ్‌బ్యాక్ అంటే!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement