IPL 2022: ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ ఎవరో చెప్పేసిన రోహిత్‌ శర్మ

mumbai indians Skipper Rohit Sharma Reveals Opening Partner - Sakshi

ఐపీఎల్‌ చరిత్రలో తిరగులేని జట్టుగా నిలిచిన మంబై ఇండియన్స్‌ ఈ ఏడాది సీజన్‌కు సరికొత్తగా సిద్దమైంది. కాగా గత సీజన్‌లో రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్‌తో కలిసి ముంబై ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు డి కాక్‌ను ముంబై రీటైన్‌ చేసుకోలేదు. దీంతో రోహిత్‌తో కలిసి ముంబై ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభస్తారన్నది అందరిలో ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలో తనతో పాటు ఎవరు బ్యాటింగ్‌కు వస్తారనే విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. నేను ఈ సీజన్‌లో కూడా ఓపెనింగ్ వస్తాను. ఈ సారి నాతో పాటు ఇషాన్ కిషన్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి ఓపెనింగ్ చేయడానికి ఎదురుచూస్తున్నాను" అని వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్‌ పేర్కొన్నాడు. అదే విధంగా ఐపీఎల్‌ మెగా వేలంలో కిషన్‌ను రూ.15.25 కోట్లకు మంబై ఇండియన్స్‌  కొనుగోలు చేసింది. ఇక తమ బౌలింగ్‌ విభాగం గురించి మాట్లాడుతూ.. "టైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్ వంటి వారు మా జట్టులో చేరారు. 

వారు మాజట్టుకు కొత్త కావచ్చు, కానీ వారు ఆటకు కొత్త కాదు. వారిద్దరూ అద్భుతమైన బౌలర్లు. గత కొన్నేళ్లగా అద్భుతంగా రాణిస్తున్నారు. జట్టుకు ఏమి చేయాలో వారికి బాగా తెలుసు" అని రోహిత్‌ తెలిపాడు. కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కిరాన్‌ పొలార్డ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌ను రీటైన్‌ చేసుకుంది. ఇక ముంబై ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, ఎన్ తిలక్ వర్మ, సంజయ్ యాదవ్, జోఫ్రా ఆర్చర్, డేనియల్ సామ్స్, టైమల్ మిల్స్, టిమ్ డేవిడ్, రిలే మెరెడిత్, మొహమ్మద్ అర్షద్ ఖాన్, అన్మోల్ ప్రీత్ సింగ్, రమణదీప్ సింగ్, రాహుల్ బుద్ధి, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్, ఆర్యన్ జుయల్, ఫాబియన్ అలెన్.

చదవండి: World Cup Super League: దక్షిణాఫ్రికాపై సంచలన విజయం.. వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌ టాప్‌లో బంగ్లాదేశ్‌! టీమిండియా ఎక్కడ?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top