FIFA WC 2022: మెస్సీ అరుదైన రికార్డు.. మరొక గోల్‌ కొడితే చరిత్రే

Messi Joint-highest Goal Scorer For Argentina Equals Gabriel Batistuta - Sakshi

అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనెల్ మెస్సీ మరో ఘనత సాధించాడు.  ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడిగా గాబ్రియేల్‌ బాటిస్టుటాతో మెస్సీ సమంగా నిలిచాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో శుక్రవారం అర్థరాత్రి నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మెస్సీ ఈ రికార్డు అందుకున్నాడు. డచ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఆట 73వ నిమిషంలో తనకు అచ్చొచ్చిన పెనాల్టీ ద్వారా మెస్సీ అర్జెంటీనాకు గోల్‌ అందించాడు.

ఈ వరల్డ్‌కప్‌లో మెస్సీకి ఇది నాలుగో గోల్‌ కాగా..  ఓవరాల్‌గా 10వ గోల్‌ కావడం విశేషం.  ఇక​ అర్జెంటీనా దిగ్గజం గాబ్రియేల్ బాటిస్టుటా 1994-2002 మధ్య 12 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో మొత్తంగా 10 గోల్స్ చేశాడు.  ఈ క్రమంలోనే తాజాగా మెస్సీ 10వ గోల్‌ సాధించి గాబ్రియేల్‌ను 24 మ్యాచ్‌ల్లో సమం చేశాడు.  కాగా ఇదే వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా స్టార్ మెస్సీ సౌదీ అరేబియా, మెక్సికో, ఆస్ట్రేలియాపై ఒక్కో గోల్ చేశాడు. దీంతో మెస్సీ అర్జెంటీనా తరపున 170 మ్యాచ్‌ల్లో 95 గోల్స్‌ నమోదు చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top