ఆ ముగ్గురు భారత ఆటగాళ్లే మా టార్గెట్‌: ఐర్లాండ్‌ ఆల్‌రౌండర్‌ | Mark Adair names Irelands BIG TARGETS from Indian team | Sakshi
Sakshi News home page

IND vs IRE: ఆ ముగ్గురు భారత ఆటగాళ్లే మా టార్గెట్‌: ఐర్లాండ్‌ ఆల్‌రౌండర్‌

Jun 26 2022 12:54 PM | Updated on Jun 26 2022 1:54 PM

Mark Adair names Irelands BIG TARGETS from Indian team - Sakshi

స్వదేశంలో ఐర్లాండ్‌ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాతో తలపడనుంది. ఆదివారం డబ్లిన్‌ వేదికగా ఇరు జట్లు మధ్య తొలి టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని ఐర్లాండ్‌ కూడా భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియాను అడ్డుకునేందుకు ఐర్లాండ్‌ ప్రణాళికలు రచిస్తోంది. హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, సంజూ శాంసన్‌లను త్వరగా ఔట్‌ చేయాలని భావిస్తున్నట్లు ఐర్లాండ్‌ ఆల్‌రౌండర్‌ మార్క్ అడైర్ తెలిపాడు.

"టీమిండియాలో హార్ధిక్‌ పాండ్యా, దినేష్‌ కార్తీక్‌, సంజూ శాంసన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. వారు ఏ స్థానంలోనైనా అద్భుతంగా బ్యాటింగ్‌ చేయగలరు. ముఖ్యంగా దినేష్‌ కార్తీక్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి కార్తీక్‌ ఏ విధంగా ఆడుతున్నాడో మనం చూస్తున్నాం. ఈ మ్యాచ్‌లో ఈ ముగ్గురు విఫలమైతే విజయం మాదే. కాబట్టి ఈ ముగ్గురును అడ్డుకునేందుకు మేము ప్రయత్నిస్తాం" అని అడైర్ పేర్కొన్నాడు.

ఐర్లాండ్‌ సిరీస్‌కు భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్  ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్‌), యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ఆర్ బిష్ణోయ్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
చదవండి: IND vs ENG Test: ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు.. టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement