కుల్దీప్‌పై రోహిత్‌ శర్మ సీరియస్‌.. గట్టిగా అరుస్తూ! వీడియో వైరల్‌ | Kuldeep Yadav in heated exchange with Rohit Sharma over missed opportunity | Sakshi
Sakshi News home page

WC 2023: కుల్దీప్‌పై రోహిత్‌ శర్మ సీరియస్‌.. గట్టిగా అరుస్తూ! వీడియో వైరల్‌

Oct 30 2023 3:42 PM | Updated on Oct 30 2023 6:19 PM

Kuldeep Yadav in heated exchange with Rohit Sharma over missed opportunity - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా విజయ పరంపర కొనసాగుతోంది. లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. టీమిండియా పేసర్లు జస్పీత్ర్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ ఇంగ్లీష్‌ ‍బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

వీరిద్దరితో పాటు కుల్దీప్‌ యాదవ్‌ కూడా స్పిన్‌ మయాజలం ప్రదర్శించాడు. షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా మూడు, కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు సాధించారు. భారత బౌలర్ల దాటికి లక్ష్య చేధనలో ఇంగ్లండ్‌ కేవలం 129 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో లైమ్‌ లివింగ్‌ స్టోన్‌ 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(87) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

కుల్దీప్‌ యాదవ్‌పై రోహిత్‌ సీరియస్‌..
కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై సీరియస్‌ అయ్యాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 22 ఓవర్‌లో కుల్దీప్‌ వేసిన మూడో బంతి లివింగ్‌ స్టోన్‌ ప్యాడ్‌కు తాకింది. వెంటనే ఎల్బీకు అప్పీలు చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ అంటూ తల ఊపాడు. అయితే రోహిత్‌ శర్మ రివ్యూ తీసుకునేందుకు ఆసక్తికనబరిచినప్పటికీ.. ​కుల్దీప్‌ నుంచి ఎటువంటి పెద్దగా స్పందన లభించలేదు.

కానీ ఆతర్వాత రిప్లేలో బంతి క్లియర్‌గా వికెట్లు తాకుతున్నట్లు కన్పించింది. ఈ క్రమంలో కుల్దీప్‌పై రోహిత్‌ గట్టిగా అరుస్తూ ఏదో అన్నాడు.  కుల్దీప్‌ మాత్రం సైలెంట్‌గా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: WC 2023: సెంచరీ కోసం ఆడేవాళ్లు ఓ రకం.. జట్టు కోసం ఆడే వాళ్లు మరో రకం.. రోహిత్‌ అలాంటి వాడే: గంభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement