కిరణ్‌ జార్జి సంచలన విజయం | Kiran Georges sensational success | Sakshi
Sakshi News home page

కిరణ్‌ జార్జి సంచలన విజయం

Oct 10 2024 4:03 AM | Updated on Oct 10 2024 4:03 AM

Kiran Georges sensational success

వాంటా (ఫిన్‌లాండ్‌): ఆర్క్‌టిక్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత రైజింగ్‌ స్టార్‌ కిరణ్‌ జార్జి సంచలనం సృష్టించాడు. ప్రపంచ 25వ ర్యాంకర్‌ వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ)తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో కిరణ్‌ జార్జి 23–21, 21–18తో గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 

గతంలో వాంగ్‌ జు వెతో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన కిరణ్‌ ఈసారి విజయం రుచి చూశాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)తో కిరణ్‌ జార్జి తలపడతాడు. 

మరోవైపు భారత స్టార్‌ లక్ష్య సేన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్‌లో లక్ష్య సేన్‌తో ఆడాల్సిన డెన్మార్క్‌ ప్లేయర్‌ రస్‌ముస్‌ గెమ్కే గాయం కారణంగా వైదొలగడంతో భారత ప్లేయర్‌ కోర్టులో అడుగుపెట్టకుండానే విజయాన్ని అందుకున్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement