India vs New Zealand: Kane Williamson to Miss 3rd T20, Tim Southee to Lead - Sakshi
Sakshi News home page

IND vs NZ: ఓటమి బాధలో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

Nov 21 2022 8:57 AM | Updated on Nov 21 2022 9:27 AM

Kane Williamson to miss 3rd T20 vs India on Tuesday - Sakshi

నేపియర్‌ వేదికగా టీమిండియాతో మూడో టీ20 ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరం కానున్నాడు. ముందుగా తీసుకున్న మెడికల్‌ అపాయింట్‌మెంట్‌కు హాజరయ్యేందుకు విలియమ్సన్ వెళ్లనున్నాడు. ఈ క్రమంలోనే అతడు దూరం కానున్నాడు.

దీంతో అతడి స్థానంలో యువ ఆటగాడు మార్క్‌ చాప్‌మన్‌ తుది జట్టులోకి రానున్నాడు. అదే విధంగా అఖరి టీ20కు టిమ్ సౌథీ కివీస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక ఈ విషయాన్ని క్రికెట్‌ న్యూజిలాండ్‌ కూడా దృవీకరించింది. "బ్లాక్‌క్యాప్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మంగళవారం నేపియర్‌లో జరిగే టీ20కు అందుబాటులో ఉండడు.

అతడు ముందుగా ఏర్పాటు చేసిన మెడికల్‌ అపాయింట్‌మెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లనున్నాడు. అతడు స్థానంలో మార్క్ చాప్‌మన్ జట్టులో చేరనున్నాడు" అని బ్లాక్‌ క్యాప్స్‌ ట్వీట్‌ చేసింది. ఇక రెండో టీ20లో కేన్‌ విలియమ్సన్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 52 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్‌ 61 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ సిరీస్‌లో ఆఖరి టీ20 నేపియర్‌ వేదికగా మంగళవారం జరగనుంది.


చదవండి: IND vs NZ: సూర్య ప్రతాపం.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement