10 వేల మీటర్ల రేసులో చెప్తెగాయ్‌కు స్వర్ణం | Joshua Cheptegei won gold in the 10000m race | Sakshi
Sakshi News home page

10 వేల మీటర్ల రేసులో చెప్తెగాయ్‌కు స్వర్ణం

Aug 4 2024 4:34 AM | Updated on Aug 4 2024 4:34 AM

Joshua Cheptegei won gold in the 10000m race

పారిస్‌: అథ్లెటిక్స్‌ పురుషుల 10,000 మీటర్ల రేసులో ఉగాండా రన్నర్‌ జోషువా చెప్తెగాయ్‌ స్వర్ణ పతకాన్ని సాధించాడు. శనివారం జరిగిన ఫైనల్లో జోషువా 26 నిమిషాల 43.14 సెకన్లలో అందరికంటే వేగంగా 10,000 మీటర్లను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో కొత్త ఒలింపిక్‌ రికార్డును నమోదు చేయడంతోపాటు ‘పారిస్‌’ గేమ్స్‌లో ఉగాండాకు తొలి పసిడి పతకాన్ని అందించాడు. 

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కెనెనిసా బెకెలె (ఇథియోపియా; 27ని:01.17 సెకన్లు) నెలకొల్పిన రికార్డును జోషువా ‘పారిస్‌’లో సవరించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన జోషువా గత మూడు ప్రపంచ చాంపియన్‌íÙప్‌లలో 10,000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచాడు. 2020 వాలెన్సియా మీట్‌లో చెప్తెగాయ్‌ 10,000 మీటర్లను 26 నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసి తన పేరిట ప్రపంచ రికార్డును నమోదు చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ఈ ప్రపంచ రికార్డు చెప్తెగాయ్‌ పేరిటే ఉంది.   

Advertisement
 
Advertisement
Advertisement