చరిత్ర సృష్టించిన నిషద్‌.. లాంగ్‌ జంప్‌, హైజంప్‌లో స్వర్ణ పతకాలు | Asian Para Games 2026: Nishad Kumar wins second gold with Games record | Sakshi
Sakshi News home page

Asian Para Games 2026: చరిత్ర సృష్టించిన నిషద్‌.. లాంగ్‌ జంప్‌, హైజంప్‌లో స్వర్ణ పతకాలు

Oct 20 2026 5:53 PM | Updated on Oct 20 2026 6:09 PM

Asian Para Games 2026: Nishad Kumar wins second gold with Games record

జపాన్‌లోని నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. పురుషుల హైజంప్ (T47) ఫైనల్‌లో భారత స్టార్ పారా అథ్లెట్ నిషాద్ కుమార్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ తుది పోటీల్లో నిషాద్ కుమార్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.

తన మొదటి ప్రయత్నాల్లోనే 1.88 మీటర్లు, 1.94 మీటర్లు, 1.98 మీటర్లు , 2.02 మీటర్ల ఎత్తును సునాయసంగా అతడు జంప్ చేశాడు. ఆ తర్వాత ఏకంగా 2.04 మీటర్ల ఎత్తును పంజ్ చేసి అగ్రస్దానంలో నిలిచి పసిడి పతకాన్ని ముద్దాడాడు.

ఈ పారా క్రీడల్లో అతడికి ఇది రెండువ బంగారు పతకం కావడం విశేషం. తద్వారా ఒకే పారా ఆసియా క్రీడల్లో రెండు పతకాలు సాధించిన మూడో భారత అథ్లెట్‌గా నిషాద్ రికార్డులకెక్కాడు. అంతకుముందు పురుషుల టీ47 లాంగ్ జంప్ కేటగిరిలో 7.11 మీటర్లు దూకి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు.  ఈ క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 26 పతకాలు సాధించింది.
చదవండి: Asian Para Games 2026: భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement