PC: BCCI/X
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. మహిళల 200 మీటర్ల (T12) ఫైనల్‌లో స్టార్ పారా స్ప్రింటర్ సిమ్రాన్ శర్మ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.
అదే రేసులో మరో భారత అథ్లెట్ తేజల్‌బెన్ దామోర్ మూడో స్ధానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. కాగా ఈ 200 మీటర్ల రేసును సిమ్రాన్ 24.80 సెకన్లలో, దామోర్ 25.23 సెకన్లలో పూర్తి చేశారు. 25.02 సెకన్లలో రేసు పూర్తిచేసిన ఇరాన్ స్ప్రింటర్ హజార్ సఫార్‌జాదేకు రజత పతకం దక్కింది.
అంతకముందు మహిళల 400 మీటర్ల టీ20 ఫైనల్లో దీప్తి జీవాంజి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్53/ఎఫ్54 ఫైనల్లో ప్రదీప్ కుమార్ రజత పతకం సాధించగా.. ఆయుష్ వర్మ కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. ఈ పారా గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు మొత్తం 26 పతకాలు సాధించింది.
చదవండి: SA vs AUS: మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డు


