'పాక్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఇష్టపడతా' | Joe Root Was Intrested At pakistan Country To Play Cricket | Sakshi
Sakshi News home page

'పాక్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఇష్టపడతా'

Aug 18 2020 10:26 AM | Updated on Aug 18 2020 11:35 AM

Joe Root Was Intrested At pakistan Country To Play Cricket - Sakshi

లండన్‌ : పాకిస్తాన్‌లో బయటి దేశాలు వచ్చి క్రికెట్‌ ఆడటానికి ఎప్పుడు సందేహిస్తూనే ఉంటాయి. 2009లో శ్రీలంక జట్టు పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లంక ఆటగాళ్లు ఉన్న బస్సు హోటల్‌ నుంచి లాహోర్‌లోని గఢాఫీ స్టేడియానికి చేరుకునే క్రమంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటనతో క్రీడాలోకం ఆశ్చర్యానికి గురయ్యింది. దీంతో ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ.. ఇతర దేశాలను పాకిస్తాన్‌ గడ్డపై మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతించలేదు.అయితే  సరిగ్గా పదేళ్ల తర్వాత(2019లో) అదే లంక జట్టు పాకిస్తాన్‌ గడ్డపై ఆడేందుకు ఒప్పుకోవడం విశేషం . ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారినా పాక్‌లో పర్యటించడానికి ఏ జట్టు కూడా సాహసం చేయడం లేదు. (చదవండి : హగ్‌ చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చా : రైనా)

ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ జో రూట్‌ ఫేస్‌బుక్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. ' పాకిస్తాన్‌కు వెళ్లి క్రికెట్‌ ఆడటం చాలా ఇష్టపడతాను.. నిజంగా ఆ దేశంలో క్రికెట్‌ ఆడడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అక్కడి వికెట్లు చూడడానికి బాగుంటాయి. పిచ్‌ ఫ్లాట్‌గా ఉంటూ.. బ్యాట్స్‌మెన్లకు అనుకూలిస్తాయి.. ' అంటూ కామెంట్‌ జత చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 'రూట్‌.. నీ రాకకోసం ఎదురుచూస్తుంటాం.. ఈరోజు రూట్‌ వస్తా అన్నాడు.. రేపు స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌లు కూడా ఆడడానికి వస్తారు' అంటూ పాక్‌ జట్టు అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement