Joe Root Returns to the Test Rankings Pinnacle After Six Years - Sakshi
Sakshi News home page

Joe Root: ‘నంబర్‌వన్‌’ రూట్‌

Sep 2 2021 6:06 AM | Updated on Sep 2 2021 1:28 PM

Joe Root returns to the Test rankings pinnacle after six years - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తాజా టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో ఇప్పటివరకు టాప్‌ ర్యాంక్‌లో ఉన్న న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (901 రేటింగ్‌ పాయింట్లు)ను వెనక్కి నెట్టి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ (916 రేటింగ్‌ పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకున్నాడు. రూట్‌ 2015 డిసెంబర్‌ తర్వాత మళ్లీ నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి.

మరోవైపు భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఈ క్రమంలో కోహ్లి (6వ ర్యాంక్‌)ను వెనక్కి నెట్టాడు. 2017 నవంబర్‌ తర్వాత భారత్‌ నుంచి మరో బ్యాట్స్‌మన్‌ కోహ్లికంటే మెరుగైన ర్యాంక్‌లో ఉండటం ఇదే మొదటిసారి.

Advertisement
 
Advertisement
Advertisement