ఆస్ట్రేలియా ఓపెన్-2025 విజేత జానిక్ సిన్నర్ | Jannik Sinner Wins Australian Open 2025 Title | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్-2025 విజేత జానిక్ సిన్నర్

Jan 26 2025 5:53 PM | Updated on Jan 26 2025 6:38 PM

Jannik Sinner Wins Australian Open 2025 Title

ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ జానిక్‌ సిన్నర్‌ (ఇటలీ) గెలుచుకున్నాడు. మెల్‌బోర్న్‌లోని రాడ్‌ లేవర్‌ ఎరినాలో ఇవాళ (జనవరి 26) జరిగిన ఫైనల్లో అలెక్స్‌ జ్వెరెవ్‌ను (జర్మనీ) 6-3 7-6(4) 6-3 తేడాతో ఓడించాడు. 

సిన్నర్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ (2 ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిళ్లు, ఓ యూఎస్‌ ఓపెన్‌) టైటిల్‌. సిన్నర్‌ గతేడాది డానిల్‌ మెద్వెదెవ్‌ను ఓడించి విజేతగా నిలిచాడు.  సిన్నర్‌ వరుసగా రెండు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 

తొలి మూడు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో ఓడిన ఆరో ఆటగాడిగా అలెక్స్‌ జ్వెరెవ్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అలెక్స్‌ జ్వెరెవ్‌కు ముందు ఆండ్రీ అగస్సీ, గోరాన్‌ ఇవానిసెవిక్‌, ఆండీ​ ముర్రే, డొమినిక్‌ థీమ్‌, కాస్పర్‌ రూడ్‌ కూడా తొలి మూడు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో ఓడారు.

  • కెరీర్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన తొలి ఇటాలియన్‌ జన్నిక్‌ సిన్నర్‌
  • జిమ్‌ కొరియర్‌ (1992-93) తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను డిఫెండ్‌ చేసుకున్న అతి పిన్నవయస్కుడు జన్నిక్‌ సిన్నర్‌
  • ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ సాధించడం ద్వారా జన్నిక్‌కు 35,00,000 ఆస్ట్రేలియన్‌ డాలర్లు ప్రైజ్‌మనీగా లభించింది. భారత కరెన్సీలో ఈ మొత్తం 19 కోట్లకు పైమాటే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement