ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ విడిచిపెట్టింది. ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది. అతడి బేస్ ప్రెస్ రూ. 30 లక్షలకే లక్నో సొంతం చేసుకుంది.
అర్జున్ ఐపీఎల్-2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌తో వున్నప్పటికి.. 2023లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ జూనియర్ టెండూల్కర్ ఇప్పటివరకు ముంబై ఫ్రాంచైజీ తరపున కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇక అర్జున్ ట్రేడ్‌పై ముంబై ఎక్స్ వేదికగా స్పందించింది.
"ముంబై ఇండియన్స్ కుటుంబంలో విలువైన సభ్యుడిగా కొనసాగినందుకు అర్జున్‌కు ధన్యవాదాలు. లక్నో సూపర్ జెయింట్స్‌తో నీ ప్రయాణం విజయవంతం కావాలి. నీ సత్తాను నిరూపించుకునేందుకు మరిన్ని అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ అర్జున్" అని ఎంఐ ఎక్స్‌లో రాసుకొచ్చింది.
ఇక రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య భారీ స్వాప్ ట్రేడ్ డీల్ ముగిసింది. రాజస్తాన్ నుంచి సంజూ శాంసన్‌ను సీఎస్‌కే ట్రేడ్ చేసుకుంది. అందుకు బదులుగా సీఎస్‌కే సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజాలను రాయల్స్‌కు పంపించింది.
ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..
1.రవీంద్ర జడేజా- చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్
2. సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్ టూ చెన్నై సూపర్ కింగ్స్
3. సామ్ కుర్రాన్ -చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్
4. మహ్మద్ షమీ- సన్‌రైజర్స్ హైదరాబాద్ టూ లక్నో సూపర్ జెయింట్స్
5. నితీష్ రాణా- రాజస్థాన్ రాయల్స్ టూ ఢిల్లీ క్యాపిటల్స్
6.అర్జున్ టెండూల్కర్- ముంబై ఇండియన్స్ టూ లక్నో సూపర్ జెయింట్స్
7. మయాంక్ మార్కండే- కోల్‌కతా నైట్ రైడర్స్ టూ ముంబై ఇండియన్స్
8. డోనోవన్ ఫెరీరా - ఢిల్లీ క్యాపిటల్స్ టూ రాజస్థాన్ రాయల్స్
9. శార్దూల్ ఠాకూర్ - లక్నో సూపర్ జెయింట్స్ టూ ముంబై ఇండియన్స్
చదవండి: IND vs SA: టీమిండియాకు ఊహించని షాక్.. ఆట మధ్యలోనే


