ఫినిష‌ర్ ఈజ్ బ్యాక్‌.. రఫ్ఫాడించిన రింకూ సింగ్‌ | IPL 2026: Rinku Singh smashes 40 off 11 in last 2 overs | Sakshi
Sakshi News home page

IPL 2026: ఫినిష‌ర్ ఈజ్ బ్యాక్‌.. రఫ్ఫాడించిన రింకూ సింగ్‌

Apr 26 2026 9:36 PM | Updated on Apr 26 2026 9:36 PM

IPL 2026: Rinku Singh smashes 40 off 11 in last 2 overs

ఐపీఎల్‌-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స్టార్ రింకూ సింగ్ అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 73 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన కేకేఆర్‌ను రింకూ త‌న విరోచిత హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు. ఓ ద‌శ‌లో ఆచితూచి ఆడిన రింకూ.. చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు.

మ‌హ్మ‌ద్ ష‌మీ వేసిన 19 ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు రాబ‌ట్టిన రింకూ సింగ్‌.. ఆ త‌ర్వాత ఆఖ‌రి ఓవ‌ర్‌లో స్పిన్న‌ర్ దిగ్వేష్ రాఠీని ఓ ఆడుకున్నాడు. ఆ ఓవ‌ర్‌లో రింకూ వ‌రుస‌గా నాలుగు సిక్స్‌లు బాది 26 ప‌రుగులు పిండుకున్నాడు. మ‌రో రెండు ప‌రుగులు వైడ్స్ రూపంలో వ‌చ్చాయి.

కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రింకూ సింగ్‌.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రింకూ సింగ్‌కు ఐపీఎల్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం.

నిప్పులు చెరిగిన మొహ్సిన్
ఇక రింకూ సునామీకి ముందు లక్నో పేసర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో కేకేఆర్ టాపర్డర్‌ను మోహ్షిన్ కుప్పకూల్చాడు. మొహ్సిన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో లిండే ఓ వికెట్ సాధించారు. మహ్మద్ షమీతో సహా మిగితా బౌలర్లందా దారుణంగా విఫలమయ్యారు.
చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్‌ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు'


 

 

Advertisement
 
Advertisement
Advertisement