'నీ సీక్రెట్స్‌ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు' | Ishan Kishan WARNS Vaibhav Sooryavanshi after his 103 knock vs SRH in IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: 'నీ సీక్రెట్స్‌ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు'

Apr 26 2026 6:42 PM | Updated on Apr 26 2026 8:06 PM

 Ishan Kishan WARNS Vaibhav Sooryavanshi after his 103 knock vs SRH in IPL 2026

ఐపీఎల్‌-2026 సీజన్‌లో శనివారం జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. వైభవ్‌ కేవలం​ 36 బంతుల్లోనే సెంచరీని సాధించి ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

అయినప్పటికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో వైభవ్ వీరోచిత సెంచరీ వృథా అయిపోయింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌తో సూర్యవంశీతో మాట్లాడుతూ కన్పించాడు. తాజాగా వారి  సంభాషణకు సంబంధించిన వివరాలను కిషన్ అభిమానులతో పంచుకున్నాడు.

"వైభ‌వ్‌ ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడో త‌న‌కు వివ‌రించాను. అత‌డు నిజంగా ఒక అద్భుత‌మైన ఆట‌గాడు. అత‌డు గ‌నుక మ‌రికొన్ని ఓవ‌ర్లు క్రీజులో ఉండి ఉంటే స్కోరు 250 దాటేది. అత‌డు బ్యాటింగ్ చేస్తున్న తీరు త‌లుచుకుంటుంటే భయమేస్తోంది. అత‌డి వికెట్ తీయడం మాకు క‌లిసొచ్చింది" అని కిష‌న్ వెల్ల‌డించాడు.

అంతేకాకుండా మా జ‌ట్టుపై కొంచెం నెమ్మ‌దిగా ఆడు, నీ రహస్యాలన్నీ నాకు తెలుసు" అని సరదాగా వైభ‌వ్‌ను హెచ్చరించినట్లు కిష‌న్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
చదవండి: నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేంద్ర సెహ్వాగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement