
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025ను పంజాబ్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఘనంగా ఆరంభించాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీల వర్షం కురిపించాడు.
అతడి ఆపడం ఎవరి తరం కాలేదు. అయితే అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ తన తొలి ఐపీఎల్ సెంచరీ మాత్రంను అందుకోలేకపోయాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో అయ్యర్ నిలిచిపోయాడు. ఈ ముంబైకర్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
'సెల్ఫ్‌లెస్ శ్రేయస్ అయ్యర్'
కాగా ఈ మ్యాచ్‌లో అయ్యర్‌కు సెంచరీ చేసే అవకాశమున్నప్పటికి.. జట్టు ప్రయోజనం కోసం నాన్ స్ట్రైక్‌లోనే ఉండిపోయాడు. తన సెంచరీ కంటే జట్టుకు పరుగులు రావడమే ముఖ్యమని అయ్యర్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్‌లో స్ట్రైక్ అంటిపెట్టుకునే ఛాన్స్ వచ్చినప్పటికి అయ్యర్ మాత్రం రెండో పరుగుకు పరిగెత్తి శశాంక్ సింగ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు.
నా సెంచరీ కోసం ఆలోచించకు నీవు హిట్టింగ్ చేయు అని శశాంక్‌కు అయ్యర్ పూర్తి స్వేఛ్చను ఇచ్చాడు. దీంతో శశాంక్ ఏకంగా ఆఖరి ఓవర్‌లో 23 పరుగులు రాబట్టాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఈ క్రమంలో సెల్ఫ్‌లెస్ ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
చదవండి: IPL 2025: గవర్నమెంట్ స్కూల్ టీచర్ కొడుకు.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం