
Photo Courtesy: BCCI/IPL
ఢిల్లీ బ్యాటింగ్ సంచలనం ప్రియాన్ష్ ఆర్య తన ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఐపీఎల్-2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ తరపున ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆర్య అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన ప్రియాన్ష్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆర్య.. ఆ తర్వాత మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. గుజరాత్ స్టార్ పేసర్లు మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లను ప్రియాంష్ ఊతికారేశాడు.
ఈ మ్యాచ్‌లో కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఆర్య.. 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి దూకుడుకు గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అడ్డుకట్టవేశాడు. ఇక అరంగేట్రంలోనే దుమ్ములేపిన ప్రియాన్ష్ ఆర్య గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఎవరీ ప్రియాన్ష్ ఆర్య..?
24 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య లిస్ట్-ఎ క్రికెట్‌లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు పవన్ ఆర్య, రాధా బాల ఇద్దరూ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులగా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలోని అశోక్ విహార్‌లో పెరిగిన ప్రియాంష్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ. ప్రియాన్ష్‌కు అతడి తల్లిదండ్రలు ఎంతో మద్దతుగా నిలిచారు. ఇటు క్రికెట్, అటు విద్యను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్య ముందుకు సాగాడు.
ఆర్య ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్వామి శ్రద్ధానంద్ కళాశాల నుండి బి.ఎ. పూర్తి చేశాడు. ఇక ప్రియాన్స్ ఆర్యా 2019లో భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్‌తో కలిసి అతడు ఆడాడు.
అయితే ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024 ద్వారా ప్రియాన్ష్ వెలుగులోకి వచ్చాడు. ఈ ఏడాది డీపీఎల్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆర్య ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. టోర్నీ ఆసాంతం ప్రియాన్ష్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఈ టోర్నీలో ఆర్య 198.69 స్ట్రైక్‌రేటుతో 608 పరుగులు చేశాడు. టీ20ల్లో కూడా మంచి రికార్డు ఈ యువ క్రికెటర్‌కు ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 356 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ సొంతం చేసుకుంది.