
ఉత్కంఠ పోరులో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ విరోచిత పోరాటం కనబరిచినప్పటికీ తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఆఖరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి.
ఈ క్రమంలో చివరి ఓవర్ వేసే బాధ్యతను కేకేఆర్ కెప్టెన్ అయ్యర్ పేసర్ హర్షిత్ రానాకు అప్పగించాడు. ఆఖరి ఓవర్ తొలి బంతినే క్లాసెన్ సిక్స్‌గా మలిచాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ విజయ సమీకరణం చివరి 5 బంతుల్లో 7 పరుగులు మారింది.
క్లాసెన్ క్రీజులో ఉండడంతో ఎస్‌ఆర్‌హెచ్‌దే విజయమని అనుకున్నారు. కానీ అనుహ్యంగా షాబాజ్ అహ్మద్, క్లాసెన్ వరుస క్రమంలో ఔట్ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్ 4 పరుగులతో పరాజయం చవి చూసింది. ఈ మ్యాచ్‌లో 29 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్.. 8 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. షాబాజ్ అహ్మద్(5 బంతుల్లో 16) తన వంతు పోరాటం చేశాడు.కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా 3 వికెట్లు పడగొట్టగా.. రస్సెల్ రెండు వికెట్లు సాధించాడు.
16 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 133/4
16 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్ 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(21), సమద్(4) పరుగులతో ఉన్నారు. ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి ఆఖరి నాలుగు ఓవర్లలో 76 పరుగులు కావాలి.
13 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 111/4
13 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్ నాలుగు వికెట్ల నష్టానికి 111 పరుగులుచేసింది. క్రీజులో క్లాసెన్, సమాద్ ఉన్నారు. ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 42 బంతుల్లో 98 పరుగులు కావాలి. అంతకుముందు మార్‌క్రమ్(18), త్రిపాఠి(20) వరుసగా మూడు, నాలుగు వికెట్లగా వెనుదిరగాడు.
రెండో వికెట్ డౌన్..
73 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ :77/2. క్రీజులో మార్‌క్రమ్(5), త్రిపాఠి(2) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్..
60 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రాహుల్ త్రిపాఠి వచ్చాడు.
దూకుడుగా ఆడుతోన్న ఎస్‌ఆర్‌హెచ్..
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(29), అభిషేక్ శర్మ(6) పరుగులతో ఉన్నారు.
రస్సెల్ విధ్వంసం.. ఎస్‌ఆర్‌హెచ్ టార్గెట్ 209 పరుగులు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రీ రస్సెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు.
అతడితో పాటు ఫిల్ సాల్ట్(54) పరుగులతో రాణించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. మయాంక్ మార్కండే రెండు, కమ్మిన్స్ ఒక్క వికెట్ సాధించారు.
రస్సెల్ విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా కేకేఆర్
భారీ స్కోర్ దిశగా కేకేఆర్ పయనిస్తోంది. రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. కేవలం 20 బంతుల్లోనే రస్సెల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 2 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. 19 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ : 200/6.
ఆరో వికెట్ డౌన్..
ఫిల్ సాల్ట్ రూపంలో కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన సాల్ట్.. మయాంక్ మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ :141/6. క్రీజులో రింకూ సింగ్(10), రస్సెల్(20) పరుగులతో ఉన్నారు.
ఐదో వికెట్ డౌన్..
105 పరుగుల వద్ద కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన రమణ్‌దీప్ సింగ్.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. మయాంక్ మార్కండే అద్భుతమైన క్యాచ్‌తో రమణ్‌దీప్‌ను పెవిలియన్‌కు పంపాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు.
12 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 105/4
కేకేఆర్ ఆటగాడు రమణ్ దీప్ సింగ్ మెరుపులు మెరిపిస్తున్నాడు. కష్టాల్లో పడిన కేకేఆర్‌ను తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అదుకున్నాడు. 12 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 105/4. క్రీజులో ఫిల్ సాల్ట్(48), రమణ్‌దీప్ సింగ్(35) పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. రాణా ఔట్
51 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన నితీష్ రాణా.. మయాంక్ మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు.
శెభాష్ నట్టు.. ఒకే ఓవర్లలో రెండు వికెట్లు
ఆరంభంలోనే కేకేఆర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ పేసర్ నటరాజన్ దెబ్బకొట్టాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన నటరాజన్ వరుసగా వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లను పెవిలియన్‌కు పంపాడు. 4 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 32/ 3
తొలి వికెట్ డౌన్..
23 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన సునీల్ నరైన్ రనౌట్ రూపంలో ఔటయ్యాడు. 3 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 27/1. క్రీజులో ఫిల్ సాల్ట్(20), వెంకటేశ్ అయ్యర్(3) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా తొలిసారి ప్యాట్ కమ్మిన్స్ బాధ్యతలు చేపట్టగా.. శ్రేయస్ అయ్యర్ తిరిగి కేకేఆర్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి