IPL 2023: రాజస్తాన్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ ఢీ.. అతడిపైనే అందరి కళ్లు

IPL 2023: SRH vs RR Playing XI Prediction - Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడేందుకు సన్‌రైజర్స్‌ హైదారాబాద్‌ సిద్దమైంది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఆరెంజ్‌ ఆర్మీ సరి కొత్తగా బరిలోకి దిగబోతుంది.

అయితే కెప్టెన్‌గా ఎంపికైన దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఐడైన్‌ మార్‌క్రమ్‌ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అతడి స్ధానంలో ఆ జట్టు సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో కెప్టెన్‌ భువీతో పాటు అభిషేక్‌ శర్మ, గ్లెన్ ఫిలిప్స్‌, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్‌ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.

వీరు చెలరేగితే రాజస్తాన్‌కు కష్టాలు తప్పవు. కాగా  ఈ ఏడాది ఐపీఎల్‌ మినీవేలంలో ఇంగ్లండ్‌ పవర్ హిట్టర్‌ హారీ బ్రూక్‌ని రూ.13.5 కోట్లకి సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆశలన్నీ బ్రూక్‌పైనే పెట్టుకుంది. ఇంగ్లండ్‌ తరపున అదరగొడుతున్న బ్రూక్‌ ఐపీఎల్‌లో ఎలా రాణిస్తాడో అని అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఓపెనింగ్‌ స్థానం కోసం కోసం మయాంక్ అగర్వాల్‌ని కూడా రూ.8.25 కోట్లు వెచ్చించి మరీ ఎస్‌ఆర్‌హెచ్  కొనుగోలు చేసింది. 

మరోవైపు రాజస్తాన్‌ కూడా పటిష్టంగా కన్పిస్తోంది. రాజస్తాన్‌ జట్టులో జోస్ బట్లర్, షిమ్రాన్‌ హెట్‌మైర్‌,  జాసన్ హోల్డర్, శాంసన్‌ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో బౌల్ట్‌, అశ్విన్‌ వంటి సీనియర్‌ బౌలర్లు ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయో ఓ సారి పరిశీలిద్దాం.

తుది జట్లు(అంచనా)
ఎస్‌ఆర్‌హెచ్‌: అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్(వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్‌), ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ఒబెడ్ మెక్‌కాయ్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఉమేశ్‌ యాదవ్‌.. ఒకే ఒక్కడు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top