Breadcrumb
Live Updates
IPL 2022: ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్
ముంబై ఇండియన్స్‌పై ఎస్ఆర్హెచ్ విజయం
కీలక మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయంతో మెరిసింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మూడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో ఆఖర్లో ఆశలు కల్పించాడు. అంతకముందు రోహిత్ శర్మ 48, ఇషాన్ కిషన్ 43 పరుగులు సాధించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్ చెరొక వికెట్ తీశారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తడబడుతుంది. 10 ఓవర్ల వరకు పటిష్టంగా కనిపించిన ముంబై.. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. 15 పరుగులు చేసిన డేనియల్ సామ్స్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో ప్రియమ్ గార్గ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
రోహిత్ శర్మ(48) ఔట్.. తొలి వికెట్ డౌన్
ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన రోహిత్ శర్మ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో జగదీష్ సుచిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
టార్గెట్ 194.. 7 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 56/0
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 29, ఇషాన్ కిషన్ 25 పరుగులతో ఆడుతున్నారు.
భారీ స్కోరు సాధించిన ఎస్ఆర్హెచ్.. ముంబై టార్గెట్ 194
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి(76) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ 42, నికోలస్ పూరన్ 38 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రమన్‌దీప్ 3, బుమ్రా, మెరిడిత్, డేనియల్ సామ్స్ తలా ఒక వికెట్ తీశారు.
పూరన్(38) ఔట్.. మూడో వికెట్ డౌన్
నికోలస్ పూరన్(38) రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. మెరిడిత్ బౌలింగ్‌లో మయాంక్ మార్కండేకు క్యాచ్ ఇచ్చి పూరన్ వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. త్రిపాఠి 76 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
త్రిపాఠి, పూరన్‌ల జోరు.. ఎస్ఆర్హెచ్ 164/2
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ దాటిగా ఆడుతోంది. రాహుల్ త్రిపాఠి (69*), పూరన్(37*) మెరుపులు మెరిపిస్తున్నారు. దీంతో ఎస్ఆర్హెచ్ 16 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 42 పరుగులతో దాటిగా ఆడుతున్న ప్రియమ్ గార్గ్ రమన్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.
దాటిగా ఆడుతున్న ఎస్ఆర్హెచ్
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ దూకుడు కనబరుస్తోంది. ఆరంభంలోనే వికెట్ కోల్పోయినప్పటికి రాహుల్ త్రిపాఠి(32), ప్రియమ్ గార్గ్(30) వేగంగా ఆడుతుండడంతో స్కోరు పరిగెడుతుంది. ప్రస్తుతం ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్
ముంబైతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన అభిషేక్ శర్మ డేనియల్ సామ్స్ బౌలింగ్‌లో మయాంక్ మార్కండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ప్రియమ్ గార్గ్ 5 పరుగులతో ఆడుతున్నాడు.
2 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 12/0
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 8, ప్రియమ్ గార్గ్(0) క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్-2022లో మంగళవారం ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన స్థితిలో ఉన్న ఎస్ఆర్హెచ్.. మరోవైపు ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ముంబైకి పెద్ద ఇబ్బంది లేకపోయినా.. ఎస్ఆర్హెచ్కు కాస్త కీలకమనే చెప్పొచ్చు.
ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. ఇక ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించింది. ఇరు జట్లు ఇప్పటి వరకు ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ముఖాముఖి 17 సార్లు తలపడగా.. ఎస్ఆర్హెచ్ 8 మ్యాచ్‌ల్లో, ముంబై 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
Related News By Category
Related News By Tags
-
కెరీర్ నిడివి 12 రోజులే.. అయితేనేం చరిత్రలో నిలిచిపోయాడు..!
క్రికెట్ చరిత్రలో మనకు తెలీని చాలా విషయాలు దాగి ఉన్నాయి. అందులో ఒకదాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. అది 1997. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన కుడి చేతి వాటం మీడియం పేసర్ ఆంధొని స్టువర్ట్ ...
-
2025 విజ్డన్ జట్టు ప్రకటన.. భారత దిగ్గజాలకు చోటు
2025 సంవత్సరానికి గానూ విజ్డన్ (Wisden) పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌ను ప్రకటించింది. ఈ జట్టులో గతేడాది వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 8 దేశాలకు చెందిన 11 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది. భారత...
-
కివీస్‌తో వన్డేలకు భారత జట్టు ఇదే!.. అతడికి నో ఛాన్స్!
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టనుంది టీమిండియా. ఇరుజట్ల మధ్య జనవరి 11, 14, 18 తేదీల్లో మూడు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం భారత్- కివీస్ (IND vs NZ) జట్లు...
-
వాళ్లిద్దరు రిటైర్ అయితే వన్డే క్రికెట్ ఏమైపోతుందో!
వన్డే క్రికెట్ రారాజుగా వెలుగొందుతున్నాడు భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి. ఇప్పటికే యాభై ఓవర్ల ఫార్మాట్లో 53 సెంచరీలు చేసిన ఈ ఢిల్లీ స్టార్... పరుగుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. మరోవైపు.. టీమి...
-
హెల్మెట్‌పై 'పాలస్తీనా జెండా' ధరించిన జమ్మూ కశ్మీర్ క్రికెటర్
జమ్ము అండ్ కశ్మీర్లో ఓ స్థానిక వ్యక్తి హెల్మెట్‌పై పాలస్తీనా జెండా ధరించి క్రికెట్ మ్యాచ్ ఆడటం వివాదాస్పదంగా మారింది. జమ్ము కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ పేరిట జరుగుతున్న క్రికెట్ టోర్నీలో ఫుర్కాన్ భ...


