IPL 2022: రోహిత్‌ శర్మ కారణంగా నిద్రలేని రాత్రులు గడిపాను.. టీమిండియా మాజీ ఓపెనర్‌

IPL 2022: Because Of Rohit Sharma I had Spent Sleepless Nights Says Gautam Gambhir - Sakshi

టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మపై భారత మాజీ ఓపెనర్, ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఐపీఎల్‌ చరిత్రలో హిట్‌మ్యాన్ అంత విజయవంతమైన కెప్టెన్‌ మరొకరు లేడని కొనియాడాడు. ఐపీఎల్‌లో తాను కేకేఆర్‌ కెప్టెన్‌గా ఉన్న సమయంలో రోహిత్‌ కారణంగా నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపాడు. ధోని, కోహ్లి లాంటి స్టార్లతో తనకెలాంటి ఇబ్బంది ఎదురవలేదని, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ ప్రణాళికలే తనకు తలనొప్పులు తెచ్చిపెట్టాయని గుర్తు చేసుకున్నాడు. 

తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ గంభీర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, గంభీర్‌ సారధ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు 2012, 2014 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలువగా, రోహిత్‌ సారధ్యంలో ముంబై జట్టు 2013, 2015, 2017, 2019, 2020  సీజన్లలో విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 2022 సీజన్‌లో గంభీర్‌.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనుండగా, రోహిత్‌.. వరుసగా తొమ్మిదో సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ సారధిగా కొనసాగనున్నాడు.
చదవండి: ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లు, షెడ్యూల్‌.. పూర్తి వివరాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top