IPL 2021: ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే వెనుదిరిగాడు!

IPL 2021: Report Says KKR Spinner Kuldeep Yadav Back India Knee Injury - Sakshi

IPL 2021: KKR Player Kuldeep Yadav Knee Injury.. కేకేఆర్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే మోకాలి గాయంతో ఇంటిబాట పట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్‌ సమయంలో కుల్దీప్‌ గాయపడ్డాడని.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

''కుల్దీప్‌కు గాయపడినట్లు వచ్చిన వార్తలు నిజమే. ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తుండగా.. మోకాలు బెణికింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వెంటనే సర్జరీ అవసరం ఉందని.. ఇండియాకు పంపించాలని వైద్యులు తెలిపారు.  ఈ మేరకు కుల్దీప్‌కు ముంబైలో సర్జరీ నిర్వహించనున్నారు. అతను కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది '' అని చెప్పుకొచ్చింది.

చదవండి: మోర్గాన్‌లా చేయాల్సి వస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకునేవాడిని..

కాగా కుల్దీప్‌ ఈ సీజన్‌లో కేకేఆర్‌ తరపున ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉండడంతో కుల్దీప్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది.   ఇక కుల్దీప్‌ టీమిండియా తరపున చివరగా శ్రీలంకతో వన్డే మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన  కుల్దీప్‌ ఆ తర్వాత జరిగిన టి20ల్లో తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత జరిగిన చివరి రెండు టి20ల్లో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. ఓవరాల్‌గా కుల్దీప్‌ యాదవ్‌ టీమిండియా తరపున 65 వన్డేల్లో 107 వికెట్లు, 23 టి20ల్లో 41 వికెట్లు, 7 టెస్టుల్లో 26 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో 45 మ్యాచ్‌లాడిన కుల్దీప్‌ 40 వికెట్లు తీశాడు.

చదవండి: రనౌట్‌ అవకాశం.. హైడ్రామా.. బతికిపోయిన అశ్విన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top