హ్యాపీ మూమెంట్స్ ఫ్రమ్ మై ఫస్ట్ మ్యాచ్ | IPL 2020: Chahal Fiancee Dhanashree Verma Celebrated RCBs Win | Sakshi
Sakshi News home page

హ్యాపీ మూమెంట్స్ ఫ్రమ్ మై ఫస్ట్ మ్యాచ్: ధనశ్రీ

Oct 18 2020 12:12 PM | Updated on Oct 18 2020 2:48 PM

IPL 2020: Chahal Fiancee Dhanashree Verma Celebrated RCBs Win - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌ అంటేనే బోలెడంత గ్లామర్‌, ఫ్యాన్స్‌ హంగామా, చీర్‌ గాళ్స్‌ చిందులు ఇలా అన్నీ కూడా కళ్లముందు కదులుతాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఖాళీ స్టేడియాలు దర్శనమిస్తూ చప్పగా సాగుతున్నాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఊహించని అతిథులు హాజరై అటు బెంగళూరు జట్టును, ఇటు వీక్షకులను ఉత్సాహపరుస్తూ కనిపించారు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కి కోహ్లి భార్య అనుష్క శర్మ, యజువేంద్ర చాహల్ కాబోయే భార్య ధనశ్రీ వర్మ హాజరయ్యారు.  (ఏబీ... మళ్లీ)

ఈ మ్యాచ్‌లో బెంగళూర్‌ టీమ్‌ విజయం సాధించడంతో ధనశ్రీ వర్మ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. 'షేరింగ్ సమ్ హ్యాపీ మూమెంట్స్ ఫ్రమ్ మై ఫస్ట్ మ్యాచ్' అనే క్యాప్షన్‌తో బెంగళూరు జట్టు సభ్యుడు పార్థివ్ పటేల్, అనుష్క శర్మ, కమెడియన్ డానిష్ సెట్, ఇతర సభ్యులతో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను షేర్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్‌ విశ్వరూపం ప్రదర్శించడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. అయితే యూట్యూబర్‌, కోరియోగ్రఫర్‌ అయినా ధనశ్రీని త్వరలో పెళ్లాడనున్నట్లు ఆగష్టులో చహల్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement