ఏబీ... మళ్లీ

Royal Challengers Bangalore beat Rajasthan Royals by 7 wickets - Sakshi

బెంగళూరును గెలిపించిన డివిలియర్స్‌

22 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 55 నాటౌట్‌ 

బౌలింగ్‌లో మెరిసిన మోరిస్‌ (4/26)

రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆరో ఓటమి

‘మిస్టర్‌ 360’ ప్లేయర్‌ డివిలియర్స్‌ సిక్సర్ల మోత... పేసర్‌ క్రిస్‌ మోరిస్‌ వికెట్ల విన్యాసాలు... కెప్టెన్‌  కోహ్లి కూల్‌ ఇన్నింగ్స్‌... వెరసి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరో సాధికారిక విజయాన్ని కైవసం చేసుకుంది. ఒకదశలో ఓటమి తప్పదా అనిపించే స్థితిలో ఉన్న బెంగళూరును డివిలియర్స్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో గట్టెక్కించాడు. మరోవైపు బ్యాట్స్‌మెన్‌ రాణించినా, బౌలర్లు విఫలం కావడంతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరో ఓటమిని ఆహ్వానించింది.

దుబాయ్‌: విజయ సమీకరణం ఎంత క్లిష్టంగా ఉన్నా... క్రీజులో డివిలియర్స్‌ ఉన్నాడంటే జట్టుకు విజయంపై ఎక్కడలేని భరోసా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్‌–13లో అబ్రహామ్‌ బెంజమిన్‌ (ఏబీ) డివిలియర్స్‌ మళ్లీ విశ్వరూపం ప్రదర్శించడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మరోసారి ఓటమి బాటను వీడి విజయతీరాలను చేరుకుంది. శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (36 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప (22 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడు కనబరిచాడు. మోరిస్‌ 4 వికెట్లతో రాయల్స్‌ను కట్టడి చేయగా... చహల్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డివిలియర్స్‌ (22 బంతుల్లో 55 నాటౌట్‌; 1 ఫోర్, 6 సిక్స్‌లు) మెరుపులతో బెంగళూరు 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగులు చేసి నెగ్గింది. దేవదత్‌ పడిక్కల్‌ (35; 2 ఫోర్లు), కెప్టెన్‌ కోహ్లి (32 బంతుల్లో 43; 1 ఫోర్, 2 సిక్స్‌లు), గురుకీరత్‌ సింగ్‌ (17 బంతుల్లో 19 నాటౌట్‌; 1 ఫోర్‌) ఆకట్టుకున్నారు.

సిక్సర్ల హోరు...
బెంగళూరు విజయ సమీకరణం చివరి 30 బంతుల్లో 64 పరుగులు. కార్తీక్‌ త్యాగి వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ మినహా మిగతా నాలుగు ఓవర్లలో కనీసం ఓ సిక్సర్‌ బాదిన డివిలియర్స్‌... 19వ ఓవర్‌లో ఉనాద్కట్‌పై రెచ్చిపోయాడు. తొలి మూడు బంతుల్లో వరుసగా మిడ్‌ వికెట్, లాంగాన్, స్క్వేర్‌ లెగ్‌లో సిక్సర్లతో విజృంభించాడు. ఐదో బంతికి గురుకీరత్‌ ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్‌లో అత్యధికంగా 25 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో బెంగళూరు విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతిపై గురుకీరత్‌ రెండు పరుగులు, రెండో బంతికి సింగిల్‌ తీశాడు. మూడో బంతి ఎదుర్కొన్న డివిలియర్స్‌ రెండు పరుగులు తీశాడు. దాంతో బెంగళూరు విజయ సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులుగా మారింది. డివిలియర్స్‌ మరో అవకాశం ఇవ్వకుండా నాలుగో బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌గా మలిచి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.

స్కోరు వివరాలు
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: ఉతప్ప (సి) ఫించ్‌ (బి) చహల్‌ 41; స్టోక్స్‌ (సి) డివిలియర్స్‌ (బి) మోరిస్‌ 15; సామ్సన్‌ (సి) మోరిస్‌ (బి) చహల్‌ 9; స్మిత్‌ (సి) షాబాజ్‌ అహ్మద్‌ (బి) మోరిస్‌ 57; బట్లర్‌ (సి) సైనీ (బి) మోరిస్‌ 24; రాహుల్‌ తేవటియా (నాటౌట్‌) 19; ఆర్చర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) మోరిస్‌ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177.
వికెట్ల పతనం: 1–50, 2–69, 3–69, 4–127, 5–173, 6–177.
బౌలింగ్‌: సుందర్‌ 3–0–25–0, మోరిస్‌ 4–0–26–4, ఉదాన 3–0–43–0, సైనీ 4–0–30–0, చహల్‌ 4–0–34–2, షాబాజ్‌ అహ్మద్‌ 2–0–18–0.  

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: దేవదత్‌ పడిక్కల్‌ (సి) స్టోక్స్‌ (బి) తేవటియా 35; ఫించ్‌ (సి) ఉతప్ప (బి) శ్రేయస్‌ గోపాల్‌ 14; కోహ్లి (సి) తేవటియా (బి) కార్తీక్‌ త్యాగి 43; డివిలియర్స్‌ (నాటౌట్‌) 55; గురుకీరత్‌ సింగ్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 179. 
వికెట్ల పతనం: 1–23, 2–102, 3–102.
బౌలింగ్‌: ఆర్చర్‌ 3.4–0–38–0, గోపాల్‌ 4–0–32–1, కార్తీక్‌ త్యాగి 4–0–32–1, ఉనాద్కట్‌ 4–0–46–0, రాహుల్‌ తేవటియా 4–0–30–1.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

24-10-2020
Oct 24, 2020, 04:53 IST
ఐపీఎల్‌లో మూడుసార్లు విజేతగా నిలిచిన జట్టు, ఐదుసార్లు రన్నరప్, బరిలోకి దిగిన పది సీజన్లలో ప్రతీసారి కనీసం ప్లే ఆఫ్స్‌కు...
23-10-2020
Oct 23, 2020, 22:33 IST
షార్జా: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత...
23-10-2020
Oct 23, 2020, 20:23 IST
షార్జా: ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెత్త రికార్డు నమోదు చేసింది....
23-10-2020
Oct 23, 2020, 19:45 IST
దుబాయ్‌: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌ దేవదూత్‌ పడిక్కల్‌పై సహచర ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ ప్రశంసలు కురిపించాడు. తాను ఆడుతున్న...
23-10-2020
Oct 23, 2020, 19:16 IST
షార్జా: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా సీఎస్‌కేతో జరుగుతున్న  రెండో అంచె మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌...
23-10-2020
Oct 23, 2020, 18:02 IST
న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్ఢ్‌కప్‌లో కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ తీవ్ర విమర్శలు వచ్చాయి. రవీంద్ర జడేజాను బిట్స్‌ అండ్‌...
23-10-2020
Oct 23, 2020, 17:28 IST
దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌ నుంచి సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో వైదొలిగిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా టోర్నీ...
23-10-2020
Oct 23, 2020, 16:41 IST
దుబాయ్‌: ఆర్చర్‌ సిద్ధంగా ఉండు.. తాడో పేడో తేల్చుకుందాం.. ఇది ఐపీఎల్‌ ఆరంభ సమయంలో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌...
23-10-2020
Oct 23, 2020, 16:12 IST
దుబాయ్‌ : కేకేఆర్‌ జట్టు సహ యజమాని.. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌కు వార్నింగ్‌...
23-10-2020
Oct 23, 2020, 15:45 IST
షార్జా: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలిచిన సంగతి తెలిసిందే....
23-10-2020
Oct 23, 2020, 05:22 IST
అబుదాబి: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు  చేతిలో ఎదురైన ఘోర పరాభవంపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హెడ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ స్పందించాడు....
23-10-2020
Oct 23, 2020, 05:14 IST
హైదరాబాద్‌ చావోరేవో తేల్చుకుంది. రాజస్తాన్‌ను బంతితో ఉక్కిరి బిక్కిరి చేసింది. బ్యాట్‌తో చకచకా పరుగులు జతచేసింది. ముఖ్యంగా మనీశ్‌ పాండే...
22-10-2020
Oct 22, 2020, 22:58 IST
దుబాయ్‌: రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. రాజస్తాన్‌ నిర్దేశించిన 155 పరుగుల టార్గెట్‌ను...
22-10-2020
Oct 22, 2020, 21:23 IST
దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 155 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ ముందుగా...
22-10-2020
Oct 22, 2020, 19:52 IST
అబుదాబి: నల్లజాతీయులపై జరుగుతున్న దాడులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌(బీఎల్‌ఎమ్‌) ఉద్యమం జరుగుతుంటే ప్రస్తుత ఐపీఎల్‌లో దాని గురించి...
22-10-2020
Oct 22, 2020, 19:15 IST
దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న రెండో అంచె మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి...
22-10-2020
Oct 22, 2020, 17:49 IST
దుబాయ్‌:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే కథ దాదాపు ముగిసినట్లే. ఇప్పటికే 10 మ్యాచ్‌లాడి ఏడు పరాజయాలను చూసిన సీఎస్‌కే...
22-10-2020
Oct 22, 2020, 17:01 IST
దుబాయ్‌: ప్రస్తుత ఐపీఎల్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌, క్వింటాన్‌ డీకాక్‌లు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే....
22-10-2020
Oct 22, 2020, 16:26 IST
న్యూఢిల్లీ:  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల  మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌ ఏకపక్షంగా సాగింది. వన్‌సైడ్‌ వార్‌ అన్నట్లు మ్యాచ్‌...
22-10-2020
Oct 22, 2020, 16:01 IST
అబుదాబి : ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో ఎంత చలాకీగా ఉంటాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాట్స్‌మన్‌గా లెక్కలేనన్ని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top