ఫైనల్లో భారత్‌ | Indian womens hockey team is a win away from qualifying for the next Pro League season | Sakshi
Sakshi News home page

ఫైనల్లో భారత్‌

Jun 21 2026 3:22 AM | Updated on Jun 21 2026 3:22 AM

Indian womens hockey team is a win away from qualifying for the next Pro League season

ఆక్లాండ్‌: తదుపరి ప్రొ లీగ్‌ సీజన్‌కు అర్హత సాధించేందుకు భారత మహిళల హాకీ జట్టు విజయం దూరంలో నిలిచింది. ప్రొ లీగ్‌కు క్వాలిఫయింగ్‌ టోర్నీ అయిన నేషన్స్‌ కప్‌లో సలీమా టెటె బృందం ఫైనల్లోకి దూసుకెళ్లింది. చిలీ జట్టుతో శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్‌ 6–0 గోల్స్‌ తేడాతో గెలిచింది. భారత్‌ తరఫున నవ్‌నీత్‌ కౌర్‌ (6వ, 13వ నిమిషాల్లో), దీపిక (14వ, 18వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చొప్పున చేయగా... నేహా (32వ నిమిషంలో), రుతుజా (39వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. 

నేడు జరిగే ఫైనల్లో ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టుతో భారత్‌ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ ‘షూటౌట్‌’లో 4–1తో జపాన్‌ జట్టును ఓడించింది. నేషన్స్‌ కప్‌ విజేత జట్టు తదుపరి ఏడాది ప్రొ లీగ్‌లో ఆడే అర్హత సంపాదిస్తుంది. ప్రొ లీగ్‌లో చివరి స్థానంలో నిలిచిన జట్టు నేషన్స్‌ కప్‌లో ఆడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement