వరల్డ్‌ నంబర్‌ వన్‌ బోపన్న జోడీకి తొలి రౌండ్‌లోనే షాక్‌  | Indian Wells Open: Bopanna Ebden Pair Crashes Out In First Round | Sakshi
Sakshi News home page

Indian Wells Open: వరల్డ్‌ నంబర్‌ వన్‌ బోపన్న జోడీకి తొలి రౌండ్‌లోనే షాక్‌ 

Mar 12 2024 7:34 AM | Updated on Mar 12 2024 11:53 AM

Indian Wells Open: Bopanna Ebden Pair Crashes Out In First Round - Sakshi

కాలిఫోర్నియా: ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్‌ జోడీ రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) తొలి రౌండ్‌లోనే నిష్కమించింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 6–7 (1/7), 6–4, 8–10తో సాండర్‌ జిలీ–జొరాన్‌ వ్లిజెన్‌ (బెల్జియం) జోడీ చేతిలో ఓడిపోయింది.

గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తొలి రౌండ్‌లో ఓడిన బోపన్న–ఎబ్డెన్‌ జంటకు 18,640 డాలర్ల (రూ. 15 లక్షల 42 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.     

Advertisement
 
Advertisement
Advertisement