భారత్‌ను గెలిపించిన శ్రీజేశ్‌  | The Indian team gave a shock to the Netherlands | Sakshi
Sakshi News home page

భారత్‌ను గెలిపించిన శ్రీజేశ్‌ 

Feb 12 2024 3:46 AM | Updated on Feb 12 2024 3:46 AM

The Indian team gave a shock to the Netherlands - Sakshi

పురుషుల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ఆదివారం భువనేశ్వర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్‌’లో 4–2తో డిఫెండింగ్‌ చాంపియన్‌ నెదర్లాండ్స్‌కు షాక్‌ ఇచ్చింది. ఈ టోర్నీలో భారత్‌కిది రెండో విజయం.

‘షూటౌట్‌’లో గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ నెదర్లాండ్స్‌ జట్టు రెండు ప్రయత్నాలను నిలువరించి భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి.

Advertisement
 
Advertisement
Advertisement