భారత బాక్సర్ల పసిడి పంచ్‌ | Indian boxers win overall championship in Asian Under 15 Boxing Tournament | Sakshi
Sakshi News home page

భారత బాక్సర్ల పసిడి పంచ్‌

May 1 2025 2:50 AM | Updated on May 1 2025 2:50 AM

Indian boxers win overall championship in Asian Under 15 Boxing Tournament

ఆసియా అండర్‌–15 బాక్సింగ్‌ టోర్నీలో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సొంతం

అమ్మాన్‌ (జోర్డాన్‌): ఆసియా జూనియర్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌ అండర్‌–15 విభాగంలో భారత బాక్సర్లు ఏకంగా 25 పతకాలతో అదరగొట్టారు. ఇందులో 11 స్వర్ణాలు, మూడు రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. ఫలితంగా ఈ విభాగంలో భారత్‌ ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 

బాలికల విభాగంలో భారత బాక్సర్లు కోమల్‌ (33 కేజీలు), ఖుషీ (35 కేజీలు), తమన్నా (37 కేజీలు), సువీ (40 కేజీలు), మిల్కీ (43 కేజీలు), ప్రిన్సీ (52 కేజీలు), నవ్య (58 కేజీలు), సునైనా (61 కేజీలు), తృష్ణ (67 కేజీలు), వన్షిక (ప్లస్‌ 70 కేజీలు)... బాలుర విభాగంలో సంస్కార్‌ వినోద్‌ (35 కేజీలు) బంగారు పతకాలు గెల్చుకున్నారు. బాలుర విభాగంలో రుద్రాక్ష్  (46 కేజీలు), అభిజీత్‌ (61 కేజీలు), లక్షయ్‌ (64 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలు దక్కించుకున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement