India Vs Ireland T20I Series 2022: Schedule, Date, Venue, Squads, Live Telecast And Other Details - Sakshi
Sakshi News home page

India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్‌ టీ 20 సిరీస్‌.. ఇరు జట్లు, షెడ్యూల్‌.. పూర్తి వివరాలు!

Jun 24 2022 11:54 AM | Updated on Jun 24 2022 1:50 PM

India Vs Ireland T20I Series: Squads Venue Telecast Timings Other Details - Sakshi

రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్‌ టూర్‌లో ఉండగా.. హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. కాగా టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాకు ఇదే తొలి సిరీస్‌ కావడం విశేషం.

ఇక ఐర్లాండ్‌తో తలపడబోయే పాండ్యా జట్టులో భువనేశ్వర్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, దినేశ్‌ కార్తిక్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, సంజూ మినహా మిగతా అంతా దాదాపుగా జూనియర్లే ఉన్నారు. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌, ఇరు జట్లు, వేదికలు, మ్యాచ్‌ ప్రసారాలు ఎప్పుడు, ఎక్కడ తదితర విషయాలు తెలుసుకుందాం.

ఐర్లాండ్‌ వర్సెస్‌ ఇండియా టీ20 సిరీస్‌
రెండు టీ20 మ్యాచ్‌లు
1.మొదటి టీ20- జూన్‌ 26, 2022- ఆదివారం- ది విలేజ్‌, డబ్లిన్‌
2.టీ20- జూన్‌ 28, 2022- మంగళవారం- ది విలేజ్‌, డబ్లిన్‌

ఐర్లాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు
హార్దిక్‌ పాండ్యా(కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌(వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌, రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా, వెంకటేశ్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, దినేశ్‌ కార్తిక్‌(వికెట్‌ కీపర్‌), ఆవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, యజువేంద్ర చహల్‌, రవి బిష్ణోయి.

భారత్‌తో సిరీస్‌కు ఐర్లాండ్‌ జట్టు
ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్‌), హ్యారీ టెక్టార్‌, గరేత్‌ డిలనీ, పాల్‌ స్టిర్లింగ్‌, కర్టిస్‌ కాంఫర్‌, స్టీఫెన్‌ డోహ్నీ, లోర్కాన్‌ టకర్‌, మార్క్‌ అడేర్‌, జార్జ్‌ డాక్రెల్‌, జాషువా లిటిల్‌, ఆండీ మెక్‌బ్రిన్‌, బ్యారీ మెకార్టీ, కానర్‌ ఆల్ఫర్ట్‌, క్రెయిగ్‌ యంగ్‌.

ప్రసార సమయం
►మ్యాచ్‌ టైమింగ్స్‌- భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు మ్యాచ్‌లు ఆరంభం
►సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ టీవీలో ప్రసారం
►సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
చదవండి: IRE Vs IND T20 Series: ఆ ఐదుగురు ఆటగాళ్లతో జర జాగ్రత్త.. లేదంటే టీమిండియాకు కష్టమే..!
IND vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. భారత జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement