IRE Vs IND T20 Series: ఆ ఐదుగురు ఆటగాళ్లతో జర జాగ్రత్త.. లేదంటే టీమిండియాకు కష్టమే..!

Five Ireland players to watch out for in India T20I series - Sakshi

హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 డబ్లిన్‌ వేదికగా జూన్‌ 26న జరగనుంది. కాగా ఈ సిరీస్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోహ్లి,బుమ్రా, రాహుల్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు దూరం కావడంతో.. జూనియర్‌ ఆటగాళ్లతో భారత్‌ బరిలోకి దిగనుంది.

ఈ క్రమంలో భారత జూనియర్‌ జట్టుపై ఐర్లాండ్‌ తమ తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ సిరీస్‌కు ఇప్పటికే 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్‌ ఐర్లాండ్‌ ప్రకటించింది. ఈ సిరీస్‌లో స్టీఫెన్ డోహెనీ, పేస్ బౌలర్ కోనార్ ఓల్‌ఫెర్ట్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు. ఇక ఈ సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే ఐదుగురు ఐర్లాండ్‌ ఆటగాళ్లపై ఓ లూక్కేద్దాం.

ఆండ్రూ బల్బిర్నీ
ఐర్లాండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ జట్టులో అనుభవం ఉన్న ఆటగాడు. క్రీజులో అతడు నిలదొక్కుకున్నాడంటే భారీ షాట్‌లు ఆడగలడు. తమ జట్టు భారీ స్కోర్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించే సత్తా బల్బిర్నీకి ఉంది. ఇప్పటి వరకు 67 టీ20లు ఆడిన బల్బిర్నీ 1429 పరుగులు సాధించాడు.

కర్టిస్ కాంఫర్
ఈ యువ ఆల్‌రౌండర్‌ తక్కువ సమయంలోనే తన ప్రదర్శనలతో అందరని అకట్టుకున్నాడు. 2021లో జింబావ్వేపై అరంగేట్రం చేసిన కర్టిస్ కాంఫర్.. ప్రస్తుతం‍ జట్టులో కీలక సభ్యలుగా మారాడు. కాంఫర్‌కు బ్యాట్‌తో బాల్‌తో రాణించే సత్తా ఉంది. టీ20 ప్రపంచకప్‌-2021 లో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించి కాంఫర్‌ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు 12 టీ20 మ్యాచ్‌లు ఆడిన కాంఫర్ 169 పరుగులతో పాటు 15 వికెట్లు పడగొట్టాడు.

పాల్ స్టిర్లింగ్
పాల్‌ స్టిర్లింగ్‌ ఐర్లాండ్‌ జట్టులో విధ్వంసకర ఆటగాడు. టీమిండియాతో సిరీస్‌లో స్టిర్లింగ్‌ కీలక పాత్ర వహించే అవకాశం ఉంది. అతడు స్పిన్నర్లకు, పేస్‌ బౌలర్లకు అద్భుతంగా ఆడగలడు. ఒక్క సారి క్రీజులో నిలదొక్కుంటే బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అదే విధంగా అతడికి అనేక ఫ్రాంచైజీ క్రికెట్‌ టోర్నీలలో ఆడిన అనుభవం కూడా ఉంది. ఇప్పటి వరకు 102 అంతర్జాతీయ టీ20లు ఆడిన అతడు 2776 పరుగులతో పాటు,20 వికెట్లు కూడా పడగొట్టాడు.

గ్రేత్‌ డెన్లీ
గ్రెత్‌ డెన్లీ ఐర్లాండ్‌ జట్టులో కీలక బ్యాటర్‌. 2019లో జింబావ్వేపై డెన్లీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఐర్లాండ్‌ జట్టులో రెగ్యూలర్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కాగా ఇటీవల జరిగిన స్కాట్లాండ్, నెదర్లాండ్స్ ట్రై సిరీస్‌లో డెన్లీ అద్భుతంగా రాణించాడు. ఇక ఇప్పటి వరకు 37 మ్యాచ్‌లు ఆడిన 694 పరుగులు చేశాడు.

మార్క్ అడైర్
మార్క్‌ అడైర్ ఐర్లాండ్‌ జట్టులో అత్యుత్తమ పేస్‌ బౌలర్‌. 26 ఏళ్ల అడైర్ ఇంగ్లీష్‌ కౌంటీలో వార్విక్‌షైర్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. అడైర్‌కి తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పు తిప్పలు పెట్టే సత్తా ఉంది. ఇప్పటి వరకు 39 మ్యాచ్‌లు ఆడిన అడైర్‌.. 59 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: సెంచరీ చేశా.. అయినా 14 మ్యాచ్‌లకు పక్కనపెట్టారు.. ఇప్పుడున్న మేనేజ్‌మెంట్‌ గనుక ఉండి ఉంటే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top