India v England: ముగ్గురు కొత్తవారికి చోటు | India v England: Shoaib Bashir, Tom Hartley and Gus Atkinson earn first Test call-ups | Sakshi
Sakshi News home page

India v England: ముగ్గురు కొత్తవారికి చోటు

Dec 12 2023 6:09 AM | Updated on Dec 12 2023 6:09 AM

India v England: Shoaib Bashir, Tom Hartley and Gus Atkinson earn first Test call-ups - Sakshi

లండన్‌: వచ్చే నెలలో భారత్‌లో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం పర్యటించే ఇంగ్లండ్‌ జట్టును సోమవారం ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టులో ముగ్గురు కొత్త ప్లేయర్లు గుస్‌ అట్కిన్‌సన్, టామ్‌ హార్ట్‌లే, షోయబ్‌ బషీర్‌లకు తొలిసారి చోటు లభించింది. కౌంటీ క్రికెట్‌లో సర్రే క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించే 25 ఏళ్ల పేస్‌ బౌలర్‌ అట్కిన్‌సన్‌ ఇప్పటికే ఇంగ్లండ్‌ తరఫున తొమ్మిది వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు ఆడాడు.

ఇంగ్లండ్‌ బృందంలో నలుగురు స్పెషలి‹Ù్ట స్పిన్నర్లు రేహన్‌ అహ్మద్, జాక్‌ లీచ్, హార్ట్‌లే, షోయబ్‌ బషీర్‌ ఉండటం విశేషం. భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది. రెండో టెస్ట్‌ (ఫిబ్రవరి 2–6) విశాఖపట్నంలో, మూడో టెస్ట్‌ (ఫిబ్రవరి 15–19) రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్ట్‌ (ఫిబ్రవరి 23–27) రాంచీలో, ఐదో టెస్ట్‌ (మార్చి 7–11) ధర్మశాలలో జరుగుతాయి.  

ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు: బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), జో రూట్, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, జాక్‌ క్రాలీ, ఒలీ పోప్, జేమ్స్‌ అండర్సన్, బెన్‌ డకెట్, బెన్‌ ఫోక్స్, జాక్‌ లీచ్, ఒలీ రాబిన్సన్, మార్క్‌ వుడ్, రేహన్‌ అహ్మద్, షోయబ్‌ బషీర్, టామ్‌ హార్ట్‌లే, జాక్‌ లీచ్, అట్కిన్‌సన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement