ఆ్రస్టేలియా చేతిలో భారత్‌ ‘షూటౌట్‌’  | India Shootout by Australia | Sakshi
Sakshi News home page

ఆ్రస్టేలియా చేతిలో భారత్‌ ‘షూటౌట్‌’ 

Feb 25 2024 4:25 AM | Updated on Feb 25 2024 4:25 AM

India Shootout by Australia - Sakshi

రూర్కెలాలో జరుగుతున్న ప్రొ హాకీ లీగ్‌లో భారత్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. శనివారం ఆ్రస్టేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ షూటౌట్‌లో 0–3 గోల్స్‌ తేడాతో ఓటమిపాలైంది. రెగ్యులర్‌ టైమ్‌లో ఇరు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్‌ తరఫున 20వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్, 29వ నిమిషంలో అమిత్‌ రోహిదాస్‌ పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్స్‌ సాధించారు.

ఆ్రస్టేలియా ఆటగాళ్లలో 23వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ ద్వారా బ్లేక్‌ గోవర్స్‌ గోల్‌ చేయగా...53వ నిమిషంలో టామ్‌ క్రెయిగ్‌ మరో గోల్‌తో స్కోరును సమం చేశాడు. దాంతో మ్యాచ్‌ ‘షూటౌట్‌’కు వెళ్లింది. ఇందులో ఆ్రస్టేలియా తరఫున షాట్‌ ఆడిన ముగ్గురూ టామ్‌ వికామ్, ఆగిల్‌వీ ఫ్లయిన్, టిమ్‌ బ్రాండ్‌ సఫలం కాగా...భారత్‌ తరఫున ప్రయత్నించిన ముగ్గురు లలిత్‌ కుమార్, సుఖ్‌జీత్‌ సింగ్, ఆకాశ్‌దీప్‌ సింగ్‌ గోల్‌ చేయడంలో విఫలమయ్యారు.

ఆ్రస్టేలియాకు లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్లతో పాటు ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను కూడా సమర్థంగా నిలువరించి పట్టుదల కనబర్చిన భారత్‌కు ఈ తుది ఫలితం తీవ్ర నిరాశ కలిగించింది.  

Advertisement
 
Advertisement
Advertisement