భారత్‌ ‘పసిడి’ పట్టు | India historic finish at U23 Asian Wrestling Championships | Sakshi
Sakshi News home page

భారత్‌ ‘పసిడి’ పట్టు

Jun 23 2025 3:17 AM | Updated on Jun 23 2025 3:17 AM

India historic finish at U23 Asian Wrestling Championships

 ఆసియా అండర్‌–23 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో టీమ్‌ టైటిల్‌ సొంతం

వుంగ్‌ తౌ (వియత్నాం): తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత పురుషుల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ జట్టు... ఆసియా అండర్‌–23 చాంపియన్‌íÙప్‌లో టీమ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత రెజ్లర్లు ఆరు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకంతో కలిపి మొత్తం ఏడు పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌ తరఫున నిఖిల్‌ (61 కేజీలు), సుజీత్‌ కల్కాల్‌ (65 కేజీలు), జైదీప్‌ (74 కేజీలు), చందర్‌ మోహన్‌ (79 కేజీలు), సచిన్‌ (92 కేజీలు), విక్కీ (97 కేజీలు) పసిడి పతకాలను గెల్చుకున్నారు. 

జస్‌పూరణ్‌ సింగ్‌ (125 కేజీలు) రజత పతకాన్ని సాధించాడు. ఫైనల్స్‌లో నిఖిల్‌ 7–2తో మెరీ బజర్‌బయేవ్‌ (కజకిస్తాన్‌)పై, సుజీత్‌ 10–0తో ఉమిద్‌జాన్‌ జలోలోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై, జైదీప్‌ 7–0తో జఫర్‌బెక్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై, చందర్‌ మోహన్‌ 5–2తో బెజెన్‌జోవ్‌ (తుర్క్‌మెనిస్తాన్‌)పై, సచిన్‌ 5–2తో తుముర్‌బాటర్‌ (మంగోలియా)పై, విక్కీ 9–6తో నూర్‌దౌలత్‌ బెకెనోవ్‌ (కజకిస్తాన్‌)పై నెగ్గారు. జస్‌పూరణ్‌ 3–4తో బత్‌బాయెర్‌ (మంగోలియా) చేతిలో ఓడిపోయాడు. ఇదే టోరీ్నలో భారత మహిళల ఫ్రీస్టయిల్‌ జట్టు కూడా పోటీపడ్డ 10 వెయిట్‌ కేటగిరీల్లో పతకాలు గెలిచి టీమ్‌ టైటిల్‌ను సాధించింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement