లార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. 21 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి | India, England Create History At Lords | Sakshi
Sakshi News home page

IND vs ENG: లార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. 21 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

Jul 14 2025 7:24 PM | Updated on Jul 14 2025 9:11 PM

India, England Create History At Lords

లార్డ్స్ వేదికగా భారత్‌-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఓ అరుదైన రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో మొత్తం బౌల్డ్ రూపంలో ఇరు జట్లు బౌలర్లు మొత్తం 14 వికెట్లను పడగొట్టారు. 21వ శతాబ్దంలో ఓ టెస్టు మ్యాచ్‌లో అత్యధిక బ్యాటర్లు బౌల్డ్ కావడం ఇదే తొలిసారి. భారత బౌలర్లు 12 బౌల్డ్‌లు చేయగా.. ఇంగ్లండ్ బౌలర్లు రెండు బౌల్డ్‌లు చేశారు.

ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్-సౌతాఫ్రికా జట్లు పేరిట ఉండేది. 2005లో స్పోర్ట్స్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో సౌతాఫ్రికా, విండీస్ బౌలర్లు కలిపి 13 బౌల్డ్‌లు చేశాడు. తాజా మ్యాచ్‌తో ఈ ఆల్‌టైమ్ రికార్డును ఇంగ్లండ్‌-భారత్ బ్రేక్ చేశాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. భారత జట్టు పోరాడుతోంది. టీమిండియా విజయానికి ఇంకా 56 పరుగులు కావాలి. రవీంద్ర జడేజా(38), జస్ప్రీత్ బుమ్రా(4) ఉన్నారు.

2000 నుంచి ఒక టెస్ట్‌లో అత్యధిక బ్యాటర్లు బౌల్డ్ అయిన మ్యాచ్‌లు ఇవే..
14 - ఇంగ్లాండ్ వర్సెస్ భారత్‌, లార్డ్స్, 2025

13 - వెస్టిండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 2005

13 - పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్, అబుదాబి, 2012

13 - ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా, నాగ్‌పూర్, 2015

13 - ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా, ఢిల్లీ, 2015

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement