
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 34.2 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ల దాటికి ఇండియా బ్యాటర్లు విల్లవిల్లాడారు.
ఉమెన్ ఇన్ బ్లూ ఆఖరి 5 వికెట్లు కేవలం 11 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం గమనార్హం. భారత జట్టు బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్(23) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతోపాటు హర్లీన్ డియోల్ (19), హర్మన్ ప్రీత్ కౌర్ (17), రిచా ఘోష్ (14) మాత్రమే రెండెంకెల స్కోర్ చేయగల్గారు.
మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు. ఇక ఆసీస్ బౌలర్లలో పేసర్ మెగాన్ స్కాట్ 5 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు కిమ్ గార్త్, గార్డనర్, కింగ్ తలా వికెట్ సాధించారు.
చదవండి: టీ20 క్రికెట్‌లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే!