భారత జట్టు (PC: BCCI X)
టీమిండియా- వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. లక్నో వేదికగా తొలి టీ20లో భారత్ గెలవగా.. రాంచిలో జరిగిన రెండో రెండో మ్యాచ్లో కరేబియన్ జట్టు విజయం సాధించింది. అనంతరం ఇండోర్ మూడో మ్యాచ్ జరగ్గా టీమిండియా జయకేతనం ఎగుర వేసింది.
2-2తో సమంగా....
అయితే, హైదరాబాద్లో బుధవారం నాటి నాలుగో టీ20లో గెలిచి వెస్టిండీస్ ఈ సిరీస్ను 2-2తో సమం చేసింది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య శనివారం జరిగే ఐదో టీ20తో సిరీస్ ఫలితం తేలనుంది. ఇందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక.
ప్రాక్టీస్ సెషన్ రద్దు
కాగా బెంగళూరులో శుక్రవారం భారీగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు కొన్ని నీటమునిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ రద్దైపోయింది. ఇక శనివారం సైతం వాన పడే సూచనలు ఉన్నట్లు ఆక్యూవెదర్ తెలిపింది.
వర్షం పడేందుకు 90 శాతం అవకాశం
బెంగళూరులో శనివారం వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్ పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల వరకు వర్షం పడేందుకు 11 శాతం, ఆ తర్వాత రెండు గంటల్లో వాన కురిసేందుకు 34 శాతం.. మూడు గంటల తర్వాత ఇందుకు 40 శాతం ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.
కాగా మ్యాచ్ ఏడు గంటలకు మొదలుకానుండగా.. ఆ సమయంలో వర్షం పడేందుకు 64 శాతం అవకాశం ఉందని.. రాత్రి పదకొండు గంటల వరకు కూడా వాన కొనసాగవచ్చని ఆక్యూ వెదర్ అంచనా వేసింది.
నిరాశలో అభిమానులు
దీంతో బెంగళూరులో భారత్- విండీస్ మ్యాచ్ చూద్దామనుకున్న అభిమానులు నిరాశ చెందుతున్నారు. చిన్నదైన చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద చూద్దామనుకుంటే.. వర్షం వల్ల అంతా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా ఉసూరుమంటున్నారు.
🚗➡️🚤 Cars turning into boats to survive #PanathurRUB after today’s rain! 🌧️ Commuters, plan your journey accordingly! Just 2 km from #ORR, home to corporate offices of @intel, @Google, @Cisco, @amazon & @SanDiskJP, this is the state of basic infrastructure in Bengaluru’s IT hub! Even after a decade, the Centre, State Govt & especially @SWRRLY @GBA_office have failed to deliver a Railway Underbridge (RUB) that works in all weather conditions. Bengaluru deserves better! Looks like #Roadster has some serious competition now! 🚤 #PanathurRUB #BengaluruTraffic #InfrastructureFailure
— Namma Balagere. (@BalagereConnect) October 16, 2026
చదవండి: IND vs WI: విండీస్తో ఐదో టీ20.. భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన


